Samantha : నాపై నీకింత అధికారం ఎలా వచ్చింది..? వైరల్ గా మారిన సమంత పోస్ట్..!

October 18, 2021 2:10 PM

Samantha : గత కొద్దిరోజుల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే అది.. సమంత, నాగ చైతన్యల విడాకుల విషయం అనే చెప్పవచ్చు. అక్టోబర్ 2వ తేదీన వీరు విడాకుల విషయాన్ని ప్రకటించినప్పటి నుంచి వీరి గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు పుట్టుకొచ్చాయి. విడాకుల విషయంలో తప్పు మొత్తం సమంతదే అంటూ.. కొందరు పోస్టులు పెట్టడంతో.. సమంత వాటికి రిప్లైగా ఎంతో భావోద్వేగమైన పోస్టులు చేసింది.

Samantha latest post about her workout trending in social media

విడాకుల ప్రకటన తర్వాత కొన్ని రోజులపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న సమంత ప్రస్తుతం తన బాధలను మర్చిపోవడం కోసం సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన అభిప్రాయాలను పంచుకుంటోంది. ఈ క్రమంలోని తాజాగా సమంత ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీ ద్వారా షేర్ చేసిన వీడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఈ సందర్భంగా సమంత పోస్ట్ చేస్తూ.. స్నేహ దేషూ నాపై నీ అధికారం ఏంటి.. నువ్విక్కడ లేకపోయినా భయం వేస్తోంది. ఎవరు చెప్పినా 30 కిలోల బరువు ఉన్న డంబెల్ వైపు కన్నెత్తి కూడా చూడను.. అలాంటిది నాలో సగం బరువు ఉన్నదానితో వర్కౌట్స్ చేస్తున్నా.. అంటూ వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్నేహ దేషూ.. సమంత జిమ్ ట్రైనర్.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment