Prakash Raj : జూబ్లీహిల్స్ ప‌బ్లిక్ స్కూల్‌కు పోలీసులు.. ప్ర‌కాష్ రాజ్‌.. క్ష‌ణ‌క్ష‌ణం ఉత్కంఠ‌..!

October 18, 2021 12:28 PM

Prakash Raj : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌లు ఏమోగానీ వివాదం మ‌రింత ముదురుతోంది. మ‌రోవైపు మంచు విష్ణు తాజాగా తిరుప‌తిలో ప్రెస్‌మీట్ పెట్టి.. త‌మ‌కు అస‌లు ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్ స‌భ్యులు 11 మందికి చెందిన రాజీనామాలు అందలేద‌ని స్ప‌ష్టం చేశారు. రాజీనామాలు అందితే నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. అయితే మ‌రోవైపు ప్ర‌కాష్ రాజ్.. హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప‌బ్లిక్ స్కూల్‌ను సంద‌ర్శించారు.

Prakash Raj and police reaches out to jubilee hills public school for cctv footage

మా ఎన్నిక‌లు జ‌రిగిన ఆ స్కూల్‌లోని పోలింగ్ కేంద్రాన్ని ఆయ‌న సంద‌ర్శించారు. ఎన్నిక‌ల అధికారికి ఇప్ప‌టికే ఆయ‌న సీసీటీవీ ఫుటేజ్ కోసం ద‌ర‌ఖాస్తు చేశారు. అయితే సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వ‌లేని చెప్పారు. దీంతో ప్ర‌కాష్ రాజ్ తీవ్ర అసంతృప్తికి గుర‌య్యారు. అయితే ప్ర‌కాష్ రాజ్ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం తీసుకోవ‌చ్చ‌ని మంచు విష్ణు చెప్పాక‌.. ఆయ‌న జూబ్లీహిల్స్ ప‌బ్లిక్ స్కూల్‌కు చేరుకోవ‌డం సంచ‌ల‌నంగా మారింది.

స్కూల్‌లో ఎన్నిక‌ల రోజు సీసీటీవీ ఫుటేజ్‌ను ప్ర‌స్తుతం ప్ర‌కాష్ రాజ్ బ‌య‌ట‌కు తీసే ప‌నిలో ఉన్నారు. ఆ రోజు గొడ‌వలు, దాడులు జ‌రిగాయ‌ని చెబుతుంటే ఎవ‌రూ న‌మ్మ‌డం లేద‌ని, క‌నుక సీసీటీవీ ఫుటేజ్ బ‌య‌ట‌కు తీస్తాన‌ని చెప్పారు. ఈ క్ర‌మంలోనే పోలీసులు సైతం స్కూల్ ద‌గ్గ‌ర‌కు చేరుకున్నారు. అస‌లు అక్క‌డ ఏం జ‌రుగుతుందోన‌ని ఉత్కంఠ‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment