Chiranjeevi : చిరంజీవి వెబ్‌సైట్ లాంచ్ చేసిన రామ్ చ‌ర‌ణ్‌.. సేవ‌లు మ‌రింత విస్తృతం చేస్తామ‌న్న చెర్రీ..

October 18, 2021 6:46 PM

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమలో ఉంటూ అంద‌రి క‌ష్ట సుఖాలు తెలుసుకుంటున్నారు. కరోనా వైరస్ లాంటి మహమ్మారి విపత్తు సమయంలో కూడా మెగాస్టార్ చిరంజీవి ఇరు రాష్ట్రాలకు ఎంతో సహాయం చేశారు. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సేవ‌లు అందించారు. ఈ సేవ‌లను మ‌రింత విస్తృతం చేసేందుకు రామ్ చ‌ర‌ణ్  చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వెబ్ సైట్ ని లాంచ్ చేశారు. హైదరాబాద్ చిరంజీవి బ్లడ్, ఐ బ్యాంక్ ఆఫీసులో రామ్ చరణ్ ఈ వెబ్ సైట్ ని లాంచ్ చేశారు.

Chiranjeevi website and trust site launched by ram charan tej

ఈ వెబ్ సైట్ ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా చిరంజీవి ట్రస్ట్ లో ఉన్న సేవల గురించి, బ్లడ్, ఐ బ్యాంకులో ఉన్న నిల్వల గురించి తెలుసుకొని సాయం పొందొచ్చు. డొనేట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఈ సైట్ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని వచ్చి డొనేట్ చేయొచ్చు. ఎవరికైనా రక్త దానం, నేత్ర దానం కావాలన్నా ఇందులో రిక్వెస్ట్ పెడితే మేము త్వరగా రెస్పాండ్ అవుతాము. ప్రస్తుతం బ్లడ్, ఐ బ్యాంక్ మాత్రమే ఉంది. త్వరలో మిగిలిన అన్ని ఆర్గాన్స్ ని డొనేట్ చేసేలాగా అవయవ దానం కూడా మొదలు పెడతాము.. అని రామ్ చ‌ర‌ణ్‌ తెలిపారు.

మేము చేసే సేవా కార్యక్రమాలకి ఎవరన్నా వాలంటీర్లుగా రావాలన్నా ఈ వెబ్ సైట్ లో అప్లై చేయొచ్చు.. అని తెలిపారు. 20 ఏళ్లుగా ఈ ట్రస్ట్ తరపున సేవ చేస్తున్నాము. ఇక ముందు కూడా చేస్తూ ఉంటాము.. అని తెలిపారు. మ‌రోవైపు చిరంజీవి పర్సనల్ వెబ్ సైట్ ని కూడా లాంచ్ చేశారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇందులో చిరంజీవి ఇప్పటిదాకా నటించిన సినిమాల వివరాలు, వాటికి సంబంధించిన ఫోటోలు, చిరంజీవి సినిమాల్లోని పాటలు, చిరంజీవి ఫోటోలు, అన్నీ అందుబాటులో ఉంచిన‌ట్టు తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now