Rashi Khanna : బాయ్ ఫ్రెండ్ లేకుండా ఎలా బ‌తుకుతున్నావ్ ? అంటూ రాశీ ఖ‌న్నాకి ప్ర‌శ్న‌లు..!

October 17, 2021 9:15 PM

Rashi Khanna : చూడ‌చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యం.. రాశీ ఖ‌న్నా సొంతం. కెరీర్ మొద‌ట్లో బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు స్లిమ్‌గా మారింది. ఇప్పుడు తెలుగులోనే కాదు.. దక్షిణాదిలోని అన్ని భాషలతో పాటు బాలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతున్న రాశీ ఖ‌న్నా తాజాగా జ‌రిగిన ఓ చిట్ చాట్‌లో బాయ్ ఫ్రెండ్ తాలూకు ప్రశ్నపై ఆసక్తికరంగా బదులిచ్చింది.

Rashi Khanna given reply to netizen who asked about her boy friend

వీలున్న‌ప్పుడ‌ల్లా నెటిజ‌న్స్‌తో ముచ్చ‌టించే రాశీ ఖ‌న్నాకు నెటిజ‌న్స్ నుండి ప‌లు ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయి. ఆమె కెరీర్, వ్యక్తిగత విషయాలపై ప్రశ్నలు సంధించారు. ఆ త‌ర్వాత ఓ నెటిజ‌న్ ‘మీ బాయ్‌ఫ్రెండ్ పేరేంటి’ అని ప్రశ్నించాడు. దీనికి రాశీ ‘అసలు నాకు బాయ్‌ఫ్రెండ్ లేడు’ అని బదులిచ్చింది. మరో నెటిజన్ ‘సింగిల్‌గా ఎలా ఉంటున్నావు’ అని అడగ్గా.. ‘ఏదో అలా గడిపేస్తున్నా’ అన్నట్లుగా సమాధానం చెప్పింది.

రాశీ ఖ‌న్నా స్ట‌న్నింగ్ ఆన్స‌ర్‌కి నెటిజ‌న్స్ షాక్ అవుతున్నారు. హిందీ చిత్రంతో నటిగా పరిచయమై.. తెలుగులో వరుస సినిమాలు చేస్తూ స్థిరపడిపోయింది రాశీ ఖన్నా. ఇలాంటి పరిస్థితుల్లోనే ‘విలన్’ అనే మూవీతో మలయాళం పరిశ్రమలోకి, ‘ఇమైక్కా నోడిగల్’ అనే చిత్రంతో కోలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఆయా భాషల్లో సైతం అదిరిపోయే నటనతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ తెలుగులో నాగ చైతన్యతో ‘థాంక్యూ’, గోపీచంద్‌తో ‘పక్కా కమర్షియల్’లో హీరోయిన్‌గా చేస్తోంది.

తమిళంలో ‘తుగ్లక్ దర్బార్’, ‘అరన్మనై 3′, ‘మేథావి’, ‘సైతాన్ కా బచ్చా’.. మలయాళంలో ‘బ్రహ్మమ్’ అనే మూవీలతో బిజీగా ఉంది. వీటితో పాటు రాజ్, డీకే రూపొందిస్తోన్న వెబ్ సిరీస్‌ చేస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment