Sreeleela : ‘పెళ్లి సందD’ హీరోయిన్ నా కూతురు కాదంటూ సంచ‌ల‌న కామెంట్స్..!

October 17, 2021 7:45 PM

Sreeleela : శ్రీకాంత్ త‌న‌యుడు రోష‌న్ హీరోగా రూపొందిన చిత్రం పెళ్లి సంద‌డి. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. పాల‌మేను లాంటి దేహంతో కుర్ర‌కారుని ఆక‌ర్షించిన శ్రీ లీల కుర్ర‌కారు మ‌తులు పోగొట్టింది. శ్రీలీలకి మంచి మార్కులు ప‌డ్డాయి. అయితే ఈ అమ్మ‌డు తాజాగా వివాదంలో ఇరుక్కుంది. శ్రీలీల తన కూతురు అంటూ వస్తున్న వార్తలను ప్రముఖ వ్యాపారవేత్త సూరపనేని శుభాకరరావు ఖండించారు.

Sreeleela is not my daughter says shubhakar rao

ఆదివారం సూరపనేని శుభాకరరావు మాట్లాడుతూ.. ‘శ్రీలీల నా కూతురు కాదు. ఆమె నా మాజీ భార్య కూతురు. మేము విడిపోయిన తర్వాత నా మాజీ భార్య శ్రీలీలకు జన్మనిచ్చింది. నా ఆస్తులను క్లెయిమ్‌ చేయడానికి ఇంటర్వ్యూలలో నా పేరు వాడుతున్నారు. నాకు, శ్రీలీలకు ఎలాంటి సంబంధం లేదు అని తెలిపారు.

సూర‌ప‌నేని ఫౌండేషన్ లో శ్రీలీల.. శుభకరరావు కుమార్తె అంటూ ఓ ప్రకటన వచ్చింది. శ్రీలీల నటించిన పెళ్లి సందD చిత్ర రిలీజ్ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రకటన చేశారు. నా అనుమతి లేకుండానే సూరపనేని పౌండేషన్ లో ఈ ప్రకటన వచ్చిందని శుభకరరావు అంటున్నారు. ఈ విషయంలో న్యాయపరంగా ముందుకెళ్తాము. ఇంకా మా విడాకులపై కేసులు నడుస్తున్నాయి. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లాము. దీనిపై సూరపనేని సొసైటీకి కూడా ఫిర్యాదు చేసినట్లు.. వ్యాపారవేత్త సూరపనేని శుభాకరరావు తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment