Swetha : ఈ వారం ఆమెకు స్పాట్‌ పెట్టారా.. ఎలిమినేష‌న్ ప‌క్కానా..!

October 17, 2021 2:42 PM

Swetha : బిగ్ బాస్ కార్య‌క్ర‌మంలో నామినేషన్స్, బెస్ట్‌, వ‌ర‌స్ట్ ప‌ర్‌ఫార్మ‌ర్ ,కెప్టెన్సీ టాస్క్‌లు ఎంతో ఆస‌క్తికరంగా సాగుతూ అంద‌రినీ ఆక‌ర్షిస్తున్నాయి. తాజాగా జ‌రిగిన నామినేష‌న్స్‌లో ఏకంగా ప‌ది మంది నిలిచారు. శ్రీరామ్ చంద్ర, సిరి, లోబో, విశ్వ, షణ్ముఖ్ జస్వంత్, ప్రియాంక, యాంకర్ రవి, జెస్సీ, శ్వేతా, సన్నీ ఉన్నారు.

Swetha may be eliminated from bigg boss 5

నామినేష‌న్స్‌లో ఉన్న వారిలో శ్రీరామ్ చంద్ర‌, ష‌ణ్ముఖ్‌, యాంక‌ర్ ర‌వికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందరికంటే ఎక్కువగా షణ్ముఖ్‌కే ఓట్లు పడుతున్నాయి. సిరిపై పాజిటివ్ అభిప్రాయాలు లేనప్పటికీ.. షణ్ముఖ్‌తో దోస్తీ ఈమెకు బాగా కలిసివస్తోంది. మిగ‌తా వారు కూడా ఛాన్స్ దొరికిన‌ప్పుడ‌ల్లా స‌త్తా చాటుతున్నారు.

అయితే ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ లేకుండా బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టిన శ్వేత వ‌ర్మ ఈ సారి ఎలిమినేట్ కానున్న‌ట్టు తెలుస్తోంది. ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ’ టాస్క్‌లో సభ్యులతో పాటు, సంచాలకులను మిస్‌లీడ్‌ చేసిన రవి, లోబో, శ్వేతలు ఈసారి వరెస్ట్‌ పెర్ఫార్మర్స్‌గా ఎక్కువ మంది ముద్ర వేశారు. జైలుకి కూడా వెళ్లింది. ర‌వి వేసిన ప్లాన్‌కి శ్వేత బ‌లి అవుతుందా.. అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment