Ram Charan : ప్ర‌భాస్ మాదిరిగానే రామ్ చ‌ర‌ణ్‌.. ఆ రేంజ్‌కి ఎదుగుతాడా..!

October 17, 2021 2:35 PM

Ram Charan : బాహుబ‌లి సినిమాతో ప్ర‌భాస్ క్రేజ్ ఏ రేంజ్‌కి ఎదిగిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్పుడు ప్ర‌భాస్ చేసే సినిమాల‌న్నీ కూడా పాన్ ఇండియా చిత్రాలే కాగా ఒక్కో చిత్రం భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోంది. ప్ర‌భాస్ న‌టించిన రాధే శ్యామ్ చిత్రం విడుద‌ల‌కి సిద్ధం కాగా, ప్ర‌స్తుతం సెట్స్‌పై స‌లార్, ఆదిపురుష్‌, ప్రాజెక్ట్ కె, సందీప్ రెడ్డి వంగా చిత్రాలు ఉన్నాయి. ఇవ‌న్నీ కూడా బ‌డా చిత్రాలే కావ‌డం విశేషం.

Ram Charan to follow in prabhas foot steps

టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మాత్రమే కాదు దేశంలోనే ఏ హీరోకి సాధ్యం కాని విధంగా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు ప్రభాస్. ఇప్పుడు ఆయ‌న అడుగు జాడ‌ల‌లో రామ్ చ‌ర‌ణ్ కూడా ప‌య‌నించాల‌ని భావిస్తున్నాడు. ఇటీవ‌ల ఆర్ఆర్ఆర్ సినిమాను పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచిన రామ్ చరణ్ ఈ చిత్రం తర్వాత భారీ దర్శకులతో భారీ బడ్జెట్ తో సినిమాలను చేస్తుండడం మెగా అభిమానులకు ఎంతగానో సంతోషాన్ని ఇస్తుంది.

శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాను మరికొద్ది రోజుల్లోనే సెట్స్ పైకి తీసుకెళ్లాలనుకున్నాడు రామ్ చరణ్. ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా త‌ర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేయ‌నున్నాడు. జెర్సీ సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ ను ఆకర్షించిన గౌతమ్ ఇప్పుడు అదే సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. గౌత‌మ్ సినిమాతో పాటుగా స‌లార్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌తో క‌లిసి క్రేజీ ప్రాజెక్ట్ చేయాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంది. పాన్ ఇండియా చిత్రాల‌తోనే సంద‌డి చేయాల‌ని రామ్ చ‌ర‌ణ్ గ‌ట్టిగా డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now