Ram Charan Tej : పిక్చ‌ర్ ప‌ర్‌ఫెక్ట్‌.. చిరంజీవి ఇంట్లో రామ్ చ‌ర‌ణ్‌తో ప్ర‌త్య‌క్ష‌మైన కేజీఎఫ్ డైరెక్ట‌ర్..!

October 16, 2021 12:35 PM

Ram Charan Tej : కొన్ని ఫొటోలు చూడ‌గానే ఇట్టే ఆక‌ర్షిస్తుంటాయి. అవి సోష‌ల్ మీడియాలోనూ తెగ వైర‌ల్ అవుతుంటాయి. తాజాగా రామ్ చ‌ర‌ణ్‌, చిరంజీవి, ప్ర‌శాంత్ నీల్ ఈ ముగ్గురూ ఒకే ఫ్రేములో క‌నిపించే స‌రికి అంద‌రి మదిలో అనేక అనుమానాలు క‌లుగుతున్నాయి. ప్ర‌శాంత్‌నీల్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు ఇది. ఈయన కోసం బాలీవుడ్ హీరోలు కూడా వేచి చూస్తున్నారు. అప్పట్లో రెండో సినిమా సింహాద్రి సినిమాతో రాజమౌళి ఎలాంటి సంచలనం రేపాడో.. ఇప్పుడు రెండో సినిమా కేజీఎఫ్ సినిమాతో అలాంటి ప్రకంపనలే సృష్టించాడు ప్రశాంత్ నీల్.

prashanth neel met Ram Charan Tej and chiranjeevi

ప్ర‌శాంత్ నీల్ రానున్న రోజులలో తెలుగు హీరోల‌తో వ‌రుస సినిమాలు చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం స‌లార్‌తో బిజీగా ఉన్న ఈ ద‌ర్శ‌కుడు త‌ర్వాత ఎన్టీఆర్, బ‌న్నీ, రామ్ చ‌ర‌ణ్‌, ప్ర‌భాస్‌తో సినిమాలు చేయ‌నున్న‌ట్టు ప్ర‌చారం న‌డుస్తోంది. ట్రిపుల్ ఆర్ మేకర్స్ తో.. రామ్ చరణ్ మరో మూవీ చేసేందుకు ఒప్పుకున్నట్లుగా తెలుస్తుండ‌గా, దీనికి డైరెక్టర్ గా ప్రశాంత్ నీల్ ను అనుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

రీసెంట్‌గా రామ్ చ‌ర‌ణ్‌.. ప్ర‌శాంత్ నీల్‌ని త‌న ఇంటికి ఆహ్వానించ‌గా, ఆ స‌మ‌యంలో చిరంజీవితో క‌లిసి ఈ ఇద్ద‌రు ఫొటో దిగారు. ఆ ఫొటోని ప్ర‌శాంత్‌నీల్ త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేస్తూ లెజెండ్‌ని క‌లిసినందుకు సంతోషంగా ఉంది. చిరంజీవిని క‌లిసినందుకు చిన్న‌ప్ప‌టి క‌ల నెర‌వేరిందంటూ సంతోషం వ్య‌క్తం చేశాడు. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ వైర‌ల్‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now