Bigg Boss : పేపర్ బాయ్ నుండి బిగ్ బాస్ హౌస్ మేట్ వరకు .. నిజంగా చాలా గ్రేట్‌..!

October 15, 2021 2:42 PM

Bigg Boss : సినీ ఇండస్ట్రీ ఎంతో మందికి జీవితంలో ఎదగడానికి ఉపయోగపడే ఓ వేదిక. ఒక్క సినిమాతో హిట్ అయ్యి లేదా బుల్లితెరపై ఒక సీరియల్ తో స్టార్ అయిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. అందులోనూ ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సెటిల్ అవ్వడమంటే సాధారణ విషయం కాదు. చాలామంది సినిమా వాళ్ళకేం హ్యాపీగా సెటిల్ అయ్యారని అనుకుంటారు. కానీ అలా సెటిల్ అవ్వడానికి అంతటి సక్సెస్ ని చేజిక్కించుకోవడానికి పడిన కష్టం అంతా ఇంతా కాదు. అలాంటి స్టార్ నటుల్లో ఎలాంటి సపోర్ట్ లేకుండా వచ్చిన విశాల్ కోటియన్ కూడా ఒకరు.

Bigg Boss he is once paper boy now bigg boss contestant

బాలీవుడ్, బుల్లితెర స్టార్ నటుడు.. హిందీ బిగ్ బాస్ సీజన్ 15 లో ఒకరు.. బిగ్ బాస్ లో అందరి కన్నా ఎక్కువ హైప్ ఉన్న యాక్టర్.. విశాల్ బుల్లితెరలో ప్రతి ప్రేక్షకులకు సుపరిచితుడే. విశాల్ మోడల్ గా మారిన యాక్టర్. అయితే ఈ నటుడి పర్సనల్ లైఫ్ లో విశేషాలెంటో ఇప్పుడు చూద్దాం. విశాల్ కోటియన్ మహారాష్ట్రలో ముంబైలో పుట్టారు. టెన్త్ క్లాస్ వరకు ఫాతిమా స్కూల్ లో చదివారు. ఆ తర్వాత డాన్ బాస్కోలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని సాధించారు. నెక్ట్స్ మాస్టర్స్ డిగ్రీని సంపాదించారు.

చిన్నతనంలో పేదరికంతో న్యూస్ పేపర్స్, పాలు, సినిమా టికెట్స్ అమ్మారని తెలిపారు. తమ కుటుంబం అన్ని కష్టాల్లో ఉండి కూడా తనను ఉన్నతమైన పాఠశాలలో చదువు చెప్పించినందుకు థ్యాంక్స్ చెప్పాడు. 1998 లో విశాల్ కోటియన్ దిల్ విల్ ప్యార్ వ్యార్ అనే ఓ షోతో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చారు. టెలివిజన్ ప్రోగ్రామ్స్ లో ఏక్ ఛాభి హై పడోస్ మే, శ్రీ ఆది మానవ్, విఘ్నవార్త గణేష్ లాంటి సీరియల్స్ లో యాక్ట్ చేశారు. ప్రస్తుతం సక్సెస్ ఫుల్ యాక్టర్ గా కెరీర్ ని రన్ చేస్తున్నారు. పేదరికంతో బాధపడినా పట్టుదల, కృషి ఉంటే జీవితంలో అనుకున్నది సాధించవచ్చని విశాల్ నిరూపించి ఎంతో మందికి స్పూర్తిగా నిలిచారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment