Vanitha Vijay Kumar : పాపం.. మేన‌కోడ‌లిని కోల్పోయి తీవ్ర విషాదంలో వివాదాస్పద న‌టి..

October 15, 2021 1:41 PM

Vanitha Vijay Kumar : వివాదాస్ప‌ద న‌టి, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ వ‌నితా విజ‌య్‌కుమార్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు చెప్ప‌న‌క్క‌ర్లేదు. మూడు, నాలుగు పెళ్లిళ్ల‌తో వార్త‌ల‌లోకి ఎక్కిన వ‌నిత తాజాగా షాకింగ్ విష‌యాన్ని వెల్ల‌డించింది. ఈ రోజు ఉద‌యం విషాద వార్త‌తోనే నిద్ర లేచాను. 20 ఏళ్ల మేన‌కోడ‌లు అనిత మ‌ర‌ణించింది. న్యూఢిల్లీలో స‌ర్జ‌రీ చేసుకున్న త‌ర్వాత గుండెపోటు రావ‌డంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది.

Vanitha Vijay Kumar lost her niece emotional post

నాకు ఆమె దేవుడు ఇచ్చిన కూతురు లాంటింది. సింగ‌పూర్‌లో ఉంటుంది. ఇంద్ర అక్క అంటే మా కుటుంబంలో అంద‌రికీ ఎంతో ఇష్టం. ఆమె కూతురు అనిత ఎంతో ద‌యాగుణం క‌లిగి ఉండేది. ఎప్పుడూ నాకు మ‌ద్దతుగా నిల‌బ‌డేది. న‌న్ను, నా పిల్ల‌ల‌ను జాగ్ర‌త్త‌గా చూసుకుంటాన‌ని మాటిచ్చింది. కానీ ఇలా మ‌మ్మ‌ల్ని అర్ధాంత‌రంగా విడిచిపెట్టి వెళ్లిపోయింది. త‌న పేరెంట్స్ సింగ‌పూర్‌లో ఉండ‌డంతో మృత‌దేహాన్నిఅక్క‌డికే త‌ర‌లించార‌ని పేర్కొంది.

https://www.instagram.com/p/CVAg-9mlkfM/?utm_source=ig_web_copy_link

నిజానికి ఈ అక్టోబ‌ర్ మ‌ధ్య‌లో మేమిద్ద‌రం క‌లుద్దాం అనుకున్నాం. త‌న‌ను నాద‌గ్గ‌రే 2 నెల‌లు ఉంచేసుకుందామ‌నుకున్నా. కోవిడ్‌, లాక్‌డౌన్ కంటే ముందుగా గ‌త రెండేళ్ల నుంచి క‌లుద్దామ‌ని ప్లాన్ చేస్తున్నాం, ఇలా జ‌ర‌గ‌డంతో నా హృద‌యం ముక్క‌లైంది. అంటూ వ‌నిత విజ‌య్ కుమార్ విచారం వ్య‌క్తం చేసింది.

మూడు పెళ్లిళ్లు చేసుకున్న వనితా విజయ్ కుమార్, మూడింటిని పెటాకులు చేసుకుంది. ఆ మధ్య నాలుగో వివాహానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు రావడం జరిగింది. అలాగే ఇటీవల ఓ జ్యోతిష్యుడు వనితా విజయ్ కుమార్ నాలుగో వివాహం చేసుకుంటారని, ఆ వరుడి పేరు ఎస్ అక్షరంతో ప్రారంభం అవుతుందని తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment