Jagapathi Babu : చెన్నైలో ఎన్టీఆర్ అభిమానుల‌తో క‌లిసి భోజ‌నం చేసిన జ‌గ‌ప‌తి బాబు..!

October 13, 2021 10:41 PM

Jagapathi Babu : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ టాలీవుడ్ టాప్ హీరోల‌లో ఒక‌రు. ఆయ‌న ప్ర‌స్తుతం సినిమాలు చేయ‌డంతోపాటు ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు కార్య‌క్ర‌మానికి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఎన్టీఆర్ స్టామినా మ‌రింత పెర‌గ‌నుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత మరికొన్ని సినిమాలకు ఆయన సైన్ చేశారు. త్వ‌ర‌లో కొరటాల శివ‌తో ఓ క్రేజీ ప్రాజెక్ట్, అలాగే స‌లార్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌తోనూ ఓ సినిమా చేయ‌నున్నారు.

Jagapathi Babu took lunch with ntr fans

అయితే ఎన్టీఆర్‌కి ఇప్పుడు అన్ని రాష్ట్రాల‌లోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయ‌న‌కు చెన్నైలోనూ ఫ్యాన్స్ ఉండ‌గా.. వారితో క‌లిసి లంచ్ చేశారు జ‌గ‌ప‌తి బాబు. చెన్నైలోని ఓ లోకల్ హోటల్ లో కొంతమంది ఎన్టీఆర్ అభిమానులతో కలిసి లంచ్ ఎంజాయింగ్ గా గడిచింది అని జగపతిబాబు ఆ హ్యాపీ మూమెంట్ ని షేర్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ విష‌యం అంతటా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఇక ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న‌ ఎవరు మీలో కోటీశ్వరులు షోకు టీఆర్పీని పెంచడానికి నానా తంటాలు పడుతున్నారు. ఇప్పటికే ఈ షోకు రామ్ చరణ్, రాజమౌళి, మహేష్ బాబు, సమంత వంటి స్టార్స్ హాజరయ్యారు. త్వ‌ర‌లో ప్ర‌భాస్ కూడా రానున్న‌ట్టు ప్రచారం జ‌రుగుతోంది. ఏదేమైనా ఇటు వెండితెర, అటు బుల్లితెర రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ జూనియ‌ర్ ర‌చ్చ చేస్తున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now