T20 WC : టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్.. టీమిండియా కొత్త జెర్సీ ఇదే..!!

October 13, 2021 6:22 PM

T20 WC : ఇప్పటి వ‌ర‌కు క్రికెట్ అభిమానులు దుబాయ్‌లో ఐపీఎల్ 14వ ఎడిష‌న్‌ను ఎంజాయ్ చేశారు. రేపో మాపో ఫైన‌ల్ కూడా జ‌ర‌గ‌బోతోంది. ఈ క్ర‌మంలోనే ఐపీఎల్ ముగిసిన వెంట‌నే పొట్టి క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ర‌గ‌నుంది. అదే దుబాయ్ వేదిక‌గా ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ప్రారంభం కానుంది. ఈ క్ర‌మంలోనే టీమిండియా కొత్త జెర్సీని బీసీసీఐ విడుద‌ల చేసింది.

T20 WC bcci unveils indian team new jersey

ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఆడ‌నున్న భార‌త జ‌ట్టు ధరించేబోయే నూత‌న జెర్సీని బీసీసీఐ ఆవిష్క‌రించింది. ఇందులో భాగంగా కేఎల్ రాహుల్‌, రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోమ్లి, ర‌వీంద్ర జ‌డేజా, జ‌స్‌ప్రిత్ బుమ్రాలు నూత‌న జెర్సీల‌ను ధ‌రించి సంద‌డి చేశారు. ఈ ఫొటోను బీసీసీఐ ట్వీట్ ద్వారా పోస్ట్ చేసింది.

వంద కోట్ల మంది భార‌తీయులు, వారి చీర్స్, వారి ప్రేర‌ణ‌తోనే ఈ జెర్సీని రూపొందించామ‌ని బీసీసీఐ తెలియజేసింది. కాగా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భాగంగా భార‌త్ త‌న తొలి మ్యాచ్‌లో చిర‌కాల ప్ర‌త్య‌ర్థి, దాయాది దేశం పాకిస్థాన్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్ ఈ నెల 24వ తేదీన జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మంలోనే టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడే దేశాల‌న్నీ ఇప్ప‌టికే దుబాయ్ చేరుకుని మ్యాచ్‌ల కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now