Balakrishna : దబిడి దిబిడే.. చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌ల‌ను ఇర‌కాటంలో పెట్ట‌బోతున్న బాల‌య్య‌..!

October 12, 2021 6:55 PM

Balakrishna : నంద‌మూరి బాల‌కృష్ణ రూటే స‌ప‌రేటు. సినిమాల్లో అయినా రియ‌ల్ లైఫ్‌లో అయినా బాల‌కృష్ణ పంథా కొత్త‌గా క‌నిపిస్తూ ఉంటుంది. అయితే ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఆహా డిజిటల్ ప్లాట్ ఫామ్ కోసం బాల‌కృష్ణ‌ అన్ స్టాపబుల్ అనే ఒక షో చేస్తున్నారు. ఇటీవ‌ల దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. ఈ షోలో సింగిల్ ప‌ర్స‌న్స్ కాకుండా ఫ్యామిలీల‌ను ఇంట‌ర్వ్యూ చేయ‌నున్నార‌ట‌.

Balakrishna planning talk show with chiranjeevi and ram charan tej

తొలి ఎపిసోడ్‌లో మంచు ఫ్యామిలీతో బాల‌కృష్ణ ఇంట‌ర్వ్యూ ఉండబోతోందని అంటున్నారు. మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మి అతిథులుగా ఈ షో ఆస‌క్తికరంగా బాల‌య్య న‌డిపించ‌నున్నారనే టాక్ వినిపిస్తోంది. తాజాగా అల్లు అరవింద్ చిరంజీవి, రామ్ చరణ్ ల‌ని ఈ షోకు అతిథులుగా వచ్చేలాగా చక్రం తిప్పుతున్నారని అంటున్నారు. ఇప్ప‌టికే ఆహా కోసం ఓ సారి చిరంజీవిని స‌మంత ఇంట‌ర్వ్యూకి తీసుకొచ్చారు అల్లు అర‌వింద్.

బాలయ్య‌కు, చిరంజీవికి మ‌ధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ప్రారంభోత్సవంలో కూడా చిరంజీవి పాల్గొని బాలకృష్ణకు తన విషెస్ అందించారు. ఇక ఇప్పుడు బాల‌కృష్ణ ‘అన్ స్టాప‌బుల్‌’ టాక్ షో కోసం చిరంజీవి త‌న త‌న‌యుడితో క‌లిసి రాబోతున్నారట‌. ఆయ‌న ఇందుకు గ్రీన్ సిగ్న‌ల్ కూడా ఇచ్చారని అంటున్నారు. ఇదే క‌నుక జ‌రిగితే షో ద‌ద్ద‌రిల్లి పోవ‌డం ఖాయం.. అని అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now