ప్రెగ్నెంట్ అయి ఉండి కూడా ఎండ‌లో విధులు నిర్వ‌ర్తిస్తున్న లేడీ పోలీస్ ఆఫీస‌ర్‌.. హ్యాట్సాఫ్‌..!

April 22, 2021 12:57 PM

క‌రోనా నేప‌థ్యంలో చాలా రాష్ట్రాల్లో ఇప్ప‌టికే రాత్రి పూట క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్నారు. అనేక చోట్ల సంపూర్ణ లాక్‌డౌన్‌ను విధించారు. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో ఉన్న‌ప్పుడు ప్ర‌జ‌లు కోవిడ్ జాగ్ర‌త్త‌ల‌ను పాటించేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే పోలీసులు కూడా ఎప్ప‌టిక‌ప్పుడు ఈ కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే ఆ లేడీ పోలీస్ ఆఫీస‌ర్ ప్రెగ్నెంట్ అయి ఉండి కూడా ఎండ‌లో ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తుండ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

dsp shilpa sahu doing duty despite pregnant

చ‌త్తీస్‌గ‌డ్‌కు చెందిన డీఎస్‌పీ శిల్పా సాహు 5 నెల‌ల గ‌ర్భిణి. అయిన‌ప్ప‌టికీ ఆమె ఎండ‌లో డ్యూటీ చేస్తోంది. మండుటెండ‌లో ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయ‌డ‌మే కాక‌, కోవిడ్ రూల్స్‌ను పాటించ‌ని వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ క్ర‌మంలోనే ఆమె అలా ప‌నిచేస్తున్నప్పుడు తీసిన ఫొటో ఒక‌టి వైర‌ల్‌గా మారింది.

అయితే ఆమె అలా డ్యూటీ చేస్తుండ‌డాన్ని చాలా మంది మెచ్చుకుంటున్నారు. కానీ కొంద‌రు మాత్రం గ‌ర్భిణీకి డ్యూటీ ఎందుకు వేశార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. అస‌లు కోవిడ్ స‌మ‌యం, క‌నుక ఆమె జాగ్ర‌త్త‌గా ఉండాలి.. అని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment