Ram Gopal Varma : మైస‌మ్మ త‌ల్లి మీద విస్కీ పోసిన రామ్ గోపాల్ వ‌ర్మ‌..!!

October 13, 2021 7:14 AM

Ram Gopal Varma : సంచ‌ల‌నాల‌కు మారుపేరుగా నిలుస్తుంటారు ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఆయ‌న ఏం చేసినా వివాదాస్ప‌దం అవుతుంటుంది. తాజాగా ఆయ‌న చేసిన ప‌ని కొన్ని వ‌ర్గాల‌కు తీవ్ర ఆగ్ర‌హం తెప్పిస్తోంది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే..

Ram Gopal Varma offered whisky to maisamma

రామ్ గోపాల్ వ‌ర్మ (ఆర్‌జీవీ) తాజాగా వ‌రంగ‌ల్‌లో మైస‌మ్మ త‌ల్లిని ద‌ర్శించుకున్నారు. త‌న కొత్త సినిమా కొండ‌ను లాంచ్ చేశారు. అయితే ఆర్‌జీవీ మైస‌మ్మ త‌ల్లి విగ్ర‌హం మీద విస్కీ పోశారు. ఇది వివాదాస్ప‌దంగా మారింది.

మైస‌మ్మ త‌ల్లి మీద విస్కీ పోస్తున్న ఫోటోల‌ను రామ్ గోపాల్ వ‌ర్మ షేర్ చేశారు. త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ‌రంగ‌ల్ లోని మైస‌మ్మ త‌ల్లి ఆల‌యం లోప‌లికి వెళ్తున్నాన‌ని, తాను కేవ‌లం వోడ్కా మాత్ర‌మే తాగుతాన‌ని, అయినా మైస‌మ్మ త‌ల్లికి విస్కీ ఇచ్చాన‌ని, చీర్స్.. అంటూ వ‌ర్మ వ‌రుస ట్వీట్లు చేశారు.

అయితే ఆయ‌న అలా చేయ‌డంపై హిందూ సంఘాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. కొన్ని ఆల‌యాల్లో దైవాల‌కు మ‌ద్యం నైవేద్యంగా ఇవ్వ‌డం మామూలే అయిన‌ప్ప‌టికీ విగ్ర‌హాల మీద మ‌ద్యం పోయ‌ర‌ని.. ఆల‌యం బ‌య‌ట అడ్డంగా నీరు పోసిన‌ట్లు మ‌ద్యం పోసి మొక్కులు తీర్చుకుంటార‌ని.. కానీ విగ్ర‌హాల మీద విస్కీ పోయ‌ర‌ని.. క‌నుక త‌మ మ‌నోభావాల‌ను దెబ్బ తీసిన వ‌ర్మ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఆర్‌జీవీ విస్కీ పోసిన సంఘ‌ట‌న తాలూకు ఫొటోలు వైర‌ల్‌గా మారాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment