Anasuya : అన‌సూయ టైమ్ న‌డుస్తోంది.. మ‌రో బంఫ‌ర్ ఆఫ‌ర్ కొట్టేసింది..!

October 12, 2021 10:22 AM

Anasuya : అటు బుల్లితెర‌పైనే కాకుండా ఇటు వెండి తెర‌పై కూడా అన‌సూయ దూసుకుపోతోంది. రంగ‌స్థ‌లం సినిమాలోనే కాక‌.. ప‌లు ఇత‌ర మూవీల్లోనూ త‌న‌దైన శైలిలో న‌టించి ఆక‌ట్టుకుంది. దీంతో రంగ‌మ్మ‌త్త‌కు ఆఫ‌ర్లు ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే అన‌సూయ‌కు మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

Anasuya  got another chance in a special song

అల్లు అర్జున్‌, సుకుమార్‌ల కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న పుష్ప మూవీలో అన‌సూయ ఓ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తోంది. అలాగే ఆమె మ‌రో మూవీలో ఇంకో స్పెష‌ల్ సాంగ్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ర‌వితేజ చాలా కాలం త‌రువాత క్రాక్ సినిమాతో హిట్ అందుకోగా.. ఆయ‌న చేస్తున్న త‌దుప‌రి మూవీలో అన‌సూయ ఓ పాట‌లో అల‌రిస్తుంద‌ని తెలిసింది.

క్రాక్ సినిమా హిట్ జోష్‌లో ఉన్న ర‌వితేజ ప్ర‌స్తుతం ఫామ్‌లోకి వ‌చ్చారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఖిలాడీ అనే మూవీలో న‌టిస్తున్నారు. ఇక న‌క్కిన త్రినాథ్ రావు ద‌ర్శ‌క‌త్వంలోనూ ర‌వితేజ ఓ మూవీ చేస్తున్నారు. కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ఇందులో అన‌సూయ ఓ స్పెష‌ల్ సాంగ్ చేస్తుంద‌ని తెలిసంది. ఈ సాంగ్ చేసేందుకు అన‌సూయ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలిసింది. త్వ‌ర‌లోనే ఈ వివ‌రాల‌ను అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now