Bigg Boss 5 : ఇంకోసారి అలాచేస్తే తోలు ఊడుతుంది జాగ్రత్త.. అంటూ హైపర్ ఆదికి వార్నింగ్ ఇచ్చిన నాగార్జున..!

October 11, 2021 3:14 PM

Bigg Boss 5 : బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున ప్రతివారం హౌస్ మేట్స్ తో ఎంతో సరదాగా ముచ్చటిస్తున్నారు. ఎప్పటిలాగే ఈ ఆదివారం నాగార్జున నవరాత్రి స్పెషల్ ఎపిసోడ్ లో భాగంగా ఎంతో అందంగా ముస్తాబై ప్రేక్షకులను, కంటెస్టెంట్ లను సందడి చేశారు.

Bigg Boss 5 nagarjuna sweet warning to hyper adi

నాగార్జున పలువురు హీరోయిన్లను స్టేజి పైకి ఆహ్వానించి అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ చేయించారు. ఇక పోలీస్ గెటప్ లో హైపర్ ఆదిని స్టేజ్ పైకి ఆహ్వానించడంతో హైపర్ ఆది స్టేజ్ పై.. హౌస్ లో ఉన్న సభ్యుల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను ఇన్వెస్టిగేట్ చేస్తానని చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలోనే హౌస్‌ సభ్యులతో తనదైన శైలిలో మాట్లాడుతూ పంచ డైలాగ్ లు వేస్తూ అందరిని నవ్వించిన ఆది అందరికంటే ముందుగా నాగార్జునపై సెటైర్లు వేయడంతో అందుకు నాగార్జున కూడా స్వీట్ వార్నింగ్ ఇస్తూ తోలు ఊడుతుంది.. అంటూ సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా వేదిక పైకి వచ్చిన హైపర్ ఆది.. నాగార్జున గారు మీ మీద మాకు ఒక కంప్లైంట్ వచ్చింది అంటూ మీరు 1989 అక్టోబర్ 5న ఒక చెయిన్ లాగారు.. అనే కంప్లైంట్ చేశారని.. నాగార్జునను అడగడంతో.. అవును లాగాను ఏంటని.. నాగార్జున సమాధానం చెప్పారు.

ఈ క్రమంలోనే నాగార్జున శివ సినిమాను గుర్తుచేస్తూ నేను లాగింది అమ్మాయి మెడలో చైన్ కాదు సైకిల్ చైన్ అంటూ సమాధానం చెప్పాడు. అవునా మీరు ఇంకా అమ్మాయి మెడలో చైన్ లాగారేమో అనుకున్నాను అంటూ తనదైన శైలిలో నవ్వించారు. ఈ క్రమంలోనే నేను కూడా ఒకరోజు శివ స్టైల్ లో చేంజ్ లాగుదామని చూశాను.. చైన్ రాకపోగా చేతిలో చర్మం వచ్చింది అంటూ ఆది మరొకసారి పంచ్ వేశాడు. అందుకు స్పందించిన నాగార్జున ఇంకొక్కసారి అలా చేయకు చర్మం ఊడుతుంది అంటూ.. హైపర్ ఆదికి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment