Chiranjeevi : మా ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తిక‌ర‌ వ్యాఖ్య‌లు..!

October 10, 2021 10:22 PM

Chiranjeevi : గ‌త కొద్ది రోజులుగా తారా స్థాయిలో జ‌రిగిన మా ఎన్నిక‌ల ప్ర‌చారానికి తెర ప‌డి ఆదివారం ఎన్నిక‌లు కూడా జ‌రిగాయి. సాయంత్రం ఫ‌లితాలు వ‌చ్చేశాయి. ఈ ఫ‌లితాల్లో మంచు విష్ణు మా అధ్య‌క్షుడిగా త‌న ప్ర‌త్య‌ర్థి ప్ర‌కాష్ రాజ్‌పై భారీ మెజారిటీతో విజ‌యం సాధించారు. అయితే మా ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై చిరంజీవి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

Chiranjeevi interesting comments on maa elections

మా ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను ఉద్దేశించి చిరంజీవి మాట్లాడుతూ.. ప‌దవులు శాశ్వ‌తం కాద‌ని, తాత్కాలిక‌మైన, చిన్న చిన్న ప‌దవుల కోసం ఒక‌రినొక‌రు వ్య‌క్తిగ‌తంగా దూషించుకోవ‌డం స‌రికాద‌ని అన్నారు. అంద‌రూ ఇండ‌స్ట్రీ అభివృద్దికి కృషి చేయాలన్నారు. ఇంత చిన్న ఎన్నిక‌లకు ఇంత హైప్ అవ‌స‌రం లేద‌న్నారు. ఇందుకు గాను మ‌న‌లో మ‌నం గొడ‌వ‌ప‌డడం బాగాలేద‌న్నారు. అంద‌రూ క‌ల‌సి క‌ట్టుగా ఉండాల‌న్నారు.

కాగా గ‌త కొద్ది రోజుల నుంచి మా ఎన్నిక‌ల నేప‌థ్యంలో చిరంజీవి త‌మ్ముడు నాగ‌బాబు కూడా ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్‌తో క‌లిసి మంచు ప్యానెల్‌పై తీవ్ర ప‌ద‌జాలంతో వ్యాఖ్య‌లు చేశారు. ఆ ప్యానెల్‌లో కేవ‌లం నాగ‌బాబు మాత్ర‌మే ప్ర‌చారంలో పాల్గొన్నారు. దీంతో మెగా ఫ్యామిలీ మొత్తం ప్ర‌కాష్ రాజ్ కు దూర‌మైంద‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. అయితే తాజాగా విడుద‌ల అయిన ఫ‌లితాల‌ను చూస్తే మంచు విష్ణుకు భారీ మెజారిటీ వ‌చ్చింది క‌నుక ఇవి ఏక‌ప‌క్ష ఎన్నిక‌లేన‌ని భావించ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now