ప్రేమ మాయలో పడి బాత్రూమ్‌లు కడిగిన టాప్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

October 10, 2021 6:13 PM

మనసు.. ఎవరికీ కనిపించకపోయినా మనిషిని శాసించేస్తుంది. ఆ మనసు గాయమైతే అది మానడానికి పట్టే కాలం ఓ జీవిత కాలం. అలాంటి మనసు ప్రేమను వరించి అర్థం చేసుకుంటే జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ప్రస్తుతం ఈ ఆధునిక జీవితంలో ప్రేమ సర్వ సాధారణం అయ్యింది. సెలెబ్రిటీస్ లో అయితే లవ్ మ్యారేజ్ అనేది ఓ ఫ్యాషన్ గా మారింది. దాదాపుగా అందరూ ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే ఎంత ఆనందంగా ప్రేమించుకుంటున్నారో, అంతే త్వరగా విడాకులు తీసుకుంటున్నారు.

do you know the actress who cleaned toilets in love

అలాగే నమ్మి ప్రేమించి మోసపోయిన వారు కూడా ఎక్కువగానే ఉన్నారు. అలా మోసపోయిన హీరోయిన్స్ లిస్ట్ కూడా పెద్దదే. ఈ క్రమంలో ప్రేమలో నమ్మి మోసపోయిన ఓ హీరోయిన్ కొన్నేళ్ళ పాటు జైలు శిక్ష అనుభవించి మానసికంగా కృంగిపోయింది. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఫేమస్ అయిన హీరోయిన్ మోనికా బేడీ. ప్యార్ ఇష్క్ ఔర్ మొహబ్బత్, జోడీ నంబర్ 1 లాంటి సినిమాలతో బీటౌన్ లో సెన్సేషనల్ హీరోయిన్ గా ఎదిగింది. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా ఎంతో ఉన్నతంగా ఎదిగింది. ఎంతో మంది అభిమానులకు ఆమె డ్రీమ్ గర్ల్.

దుబాయ్ లో యాక్టర్ అనుకున్న అబు సలీమ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్ళి చేసుకుని దుబాయ్ కి వెళ్ళింది. అక్కడకు వెళ్ళిన తర్వాత అతను యాక్టర్ కాదని, ఓ అండర్ వరల్డ్ డాన్ అని తెలిసి షాక్ కి గురైంది. ఈ క్రమంలో చట్టానికి వ్యతిరేకంగా ఉన్న ఆ డాన్ దొంగ పాస్ పోర్ట్స్ తయారు చేయించి మరో దేశానికి వెళ్ళిపోవడానికి రెడీ అయ్యాడు. పోలీసులు ఈ విషయాన్ని గ్రహించడంతో అబు సలీమ్, మోనికా బేడీలను అరెస్ట్ చేశారు. దొంగ పాస్ పోర్ట్స్ తో వెళ్తున్నందుకు గాను వారిని అరెస్ట్ చేసి జైలులో పెట్టారు. జైలులో మోనికా బేడీ బాత్రూమ్ లు కూడా కడిగిందట. ఆమె సత్ప్రవర్తన కారణంతో 2010 లో బెయిల్ పై బయటకు వచ్చి, మనోస్థైర్యంతో సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now