Pawan Kalyan : సినిమా వేడుక‌కు గెస్ట్‌గా ప‌వ‌న్.. ఈ సారి ఎలాంటి సంచ‌ల‌నం సృష్టిస్తారో మ‌రి..!

October 7, 2021 5:06 PM

Pawan Kalyan : సాయి ధ‌ర‌మ్ తేజ్ న‌టించిన రిప‌బ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ప‌వ‌న్ క‌ళ్యాణ్ చీఫ్ గెస్ట్‌గా హాజ‌రైన విష‌యం తెలిసిందే. ఆ ఈవెంట్‌లో వైసీపీ ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేసి ప‌వర్ స్టార్ ఎలాంటి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడో మ‌నం చూసాం. జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని చీల్చి చెండాడాడు. ఈ ఈవెంట్ త‌ర్వాత ఫిలిం ఛాంబ‌ర్.. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌కు, త‌మ‌కు ఎలాంటి సంబంధం లేద‌ని ప్రెస్ నోట్ విడుద‌ల చేసింది. కొంద‌రు నిర్మాత‌లు కూడా ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌ను త‌ప్పు ప‌ట్టారు.

Pawan Kalyan to attend another movie function

ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు మ‌రో సినిమా ఈవెంట్‌కి గెస్ట్‌గా వ‌స్తాడ‌నే విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆర్ఎక్స్ 100 చిత్ర ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి.. శర్వానంద్ – బొమ్మరిల్లు సిద్ధార్థ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో మ‌హా స‌ముద్రం సినిమా తెర‌కెక్కించాడు. ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ శరవేగంగా ప్రమోషన్స్ చేస్తున్నారు.

అక్టోబర్ 9 ఆదివారం సాయంత్రం 6 గంటలకు JRC కన్వెన్షన్ హాల్ లో ఈ కార్యక్రమం జరుగనుందని చిత్ర బృందం ప్రకటించింది. అయితే ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ ను చీఫ్ గెస్ట్ గా తీసుకురావాలని నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. పవన్ ఓకే అంటే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇవ్వాలని చూస్తున్నారట. ఈ ఫంక్ష‌న్‌కి ప‌వ‌న్ వ‌స్తే రిప‌బ్లిక్ ఈవెంట్ త‌ర‌హాలో అద‌ర‌గొడ‌తాడా లేదంటే సినిమా గురించి మాట్లాడి వెళ‌తారా అన్న‌ది తేలాల్సి ఉంది. ‘మహా సముద్రం’ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతం సమకూర్చారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now