భార్యను చంపి గుండెపోటుగా చిత్రీకరించిన భర్త.. బంధువుల ఎంట్రీతో బయట పడిన నిజం..

October 8, 2021 8:15 AM

అగ్నిసాక్షిగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన భార్యాభర్తల బంధంలో భార్యాభర్తలు జీవితాంతం ఎంతో అన్యోన్యంగా ఉండాలని భావిస్తారు. అయితే కట్టుకున్న భార్యను దారుణంగా కడతేర్చి.. ఆమె గుండెపోటుతో మరణించిందని..  అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తూ ఆ భర్త అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

man murdered wife told to family she has heart attack

సూర్యాపేట జిల్లా నాగారం మండలం పస్తాలకు చెందిన చిత్తలూరు శ్రీనివాస్, సురాంభ దంపతులు. 18 సంవత్సరాల క్రితం రామంతపూర్ వలసవచ్చి ఇద్దరూ కూరగాయల వ్యాపారం చేసుకొనేవారు. ఈ దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. గత కొద్ది రోజుల నుంచి శ్రీనివాస్ ఏ విధమైన పనులు చేయకుండా ఖాళీగా ఉండటమే కాకుండా అవసరం కోసం ఇతరుల దగ్గర డబ్బులు తీసుకుని అప్పులు చేసేవాడు. ఈ క్రమంలోనే అప్పు ఇచ్చిన వారు ఇంటి పైకి రావడంతో భార్యాభర్తల మధ్య గొడవ చోటుచేసుకుంది.

ఇలా తరచూ వీరిద్దరూ గొడవపడటంతో భార్యపై ఎంతో కక్ష పెట్టుకున్న శ్రీనివాస్ ఒక రోజు పిల్లలు నిద్రపోతున్న సమయం చూసి తన భార్యను కొట్టాడు. అప్పటికి తన భార్య కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతుంటే తన గొంతు నులిమి చంపాడు. ఎవరికీ తెలియకుండా శవాన్ని దహనం చేయాలని అర్ధరాత్రి సమయంలో టాటా ఏస్ లో తన భార్య మృతదేహాన్ని తీసుకుని వెళ్తుండగా తనకు కొడుకు, కూతురు ఫోన్ చేయడంతో కూరగాయల కోసం వెళ్తున్నామని అబద్ధం చెప్పాడు.

అయితే తనని దహనం చేయాలని భావించే సమయానికి తెల్లవారు కావడంతో తన ప్లాన్ రివర్స్ అయ్యింది. ఈ క్రమంలోనే కూరగాయల కోసం అతను వెళ్లగా తన భార్యకు గుండెపోటు వచ్చిందని.. దాంతో తను మరణించిందని నాటకం ఆడాడు. అయితే ఆమె శరీరంపై ఉన్న గాయాలు చూసి తమ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు గుట్టు బయట పడింది. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment