Posani Krishna Murali : పోసాని కనిపించడం లేదు.. ఆందోళనలో నిర్మాతలు..?

October 6, 2021 2:31 PM

Posani Krishna Murali : నటుడిగా, రచయితగా సినిమా ఇండస్ట్రీకి ఎంతో సుపరిచితమైన నటుడు పోసాని కృష్ణ మురళి గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పెద్దఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం.. ఆయన పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడమే. రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు పోసాని స్పందిస్తూ ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని కూడా దూషిస్తూ మాట్లాడటంతో పవన్ అభిమానులు ఎంతో ఆగ్రహం చెందారు.

Posani Krishna Murali is not seen producers worry

కాగా పవన్ కళ్యాణ్ అభిమానులు పోసానిపై, ఆయన ఇంటిపై దాడులు చేశారు. అయితే పోసాని కృష్ణమురళి గత రెండు రోజుల నుంచి ఎవరికీ కనిపించడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయనతో సినిమాలు చేస్తున్న నిర్మాతలు పోసాని కనిపించడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే పోసాని ఎక్కడికి వెళ్ళారు.. ఏం చేస్తున్నారు.. అనే విషయం గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఈ క్రమంలోనే పోసాని కొద్దిరోజులు మీడియాకు కనిపించకుండా ఉండటం కోసం తన ఇంటిని వదిలి తన సన్నిహితుల ఇంటిలో నివసిస్తున్నారనే సమాచారం అందుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now