Pawan Kalyan BJP : బ‌ద్వేల్ ఉప ఉన్నిక‌.. ప‌వ‌న్‌ను ఇరుకున‌ పెడుతున్న బీజేపీ ?

October 6, 2021 10:17 AM

Pawan Kalyan BJP : బ‌ద్వేల్ ఉప ఉన్నిక‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల అవ‌డం ఏమోగానీ.. ఈ ఉప ఎన్నిక‌తో బీజేపీ ప‌వ‌న్‌ను ఇరుకున పెడుతున్న‌ట్లు తెలుస్తోంది. ఓ వైపు అక్క‌డ పోటీ చేసేది లేద‌ని, ఏక‌గ్రీం అయితే బాగుంటుంద‌ని.. ప‌వ‌న్ చెప్పేశారు. అయితే గ‌తంలో టీడీపీతో ఉన్న అనుబంధ‌మో, మ‌రో విష‌య‌మో తెలియ‌దు కానీ.. ప‌వ‌న్ చెప్పిన‌ట్లుగా.. టీడీపీ కూడా అక్క‌డ పోటీ చేయ‌డం లేద‌ని చెప్పింది. దీంతో ఈ విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Pawan Kalyan BJP gives uncomfort to Pawan Kalyan over badwel by-election

అయితే ప‌వ‌న్‌, బీజేపీ మిత్రులు కనుక‌.. ఒక‌రి నిర్ణ‌యాన్ని మ‌రొక‌రు స్వాగ‌తించాల్సి ఉంటుంది. కానీ ప‌వ‌న్ నిర్ణ‌యానికి మాత్రం బీజేపీ వ్య‌తిరేకంగా వెళ్తోంది. ప‌వ‌న్ వ‌ద్దు అంటుంటే.. బీజేపీ మాత్రం పోటీ చేయాల్సిందేన‌ని ప‌ట్టుబ‌ట్టింది. మ‌రోవైపు ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు ఒక అడుగు ముందుకు వేసి బ‌ద్వేల్‌లో పోటీ చేస్తామ‌ని, విడిచిపెట్టే ప్ర‌స‌క్తి లేద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు. అలాగే త‌మ ప్ర‌చారానికి ప‌వ‌న్ కూడా వ‌స్తార‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో బీజేపీ ప‌వ‌న్‌ను ఇరుకున పెట్టిన‌ట్లు అయింది.

Pawan Kalyan BJP gives uncomfort to Pawan Kalyan over badwel by-election

అయితే బ‌ద్వేల్‌లో పోటీ చేయొద్ద‌న్న ప‌వ‌న్ త‌న నిర్ణ‌యాన్ని తానే వ్య‌తిరేకించి బీజేపీతో ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేస్తారా ? లేదా ? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఎందుకంటే.. రాజ‌కీయాల్లో ఒక నిర్ణ‌యం తీసుకుంటే దానికి క‌ట్టుబ‌డి ఉంటేనే ప్ర‌జ‌ల నుంచి ఆమోదం ల‌భిస్తుంది. అలా కాకుండా త‌న నిర్ణ‌యానికి తానే వ్య‌తిరేకంగా వెళితే.. ప్ర‌జామోదం ల‌భించ‌దు. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ వ‌ద్దంటుండ‌డం, బీజేపీ పోటీ చేస్తామ‌ని అంటుండ‌డం.. చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

Pawan Kalyan BJP : ప‌వ‌న్ తీసుకునే నిర్ణ‌యంపైనే భ‌విష్య‌త్తు

బ‌ద్వేల్ లో పోటీ చేయాల‌న్న బీజేపీ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించి ప‌వ‌న్ త‌న నిర్ణ‌యాన్ని తానే వ్య‌తిరేకించి ముందుకు సాగుతారా ? లేక త‌న నిర్ణ‌యానికి తాను క‌ట్టుబ‌డి ఉంటారా ? అని.. రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ న‌డుస్తోంది. అయితే ప‌వ‌న్ తీసుకునే నిర్ణ‌యంపైనే ఆ పార్టీ రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని చ‌ర్చించుకుంటున్నారు. ఎందుకంటే బీజేపీ చెప్పిన‌ట్లు చేయ‌క‌పోతే జ‌న‌సేన‌కు భ‌విష్య‌త్తులో మ‌ద్ద‌తు ఇచ్చే అవ‌కాశాలు స‌న్న‌గిల్లుతాయి. మ‌రి ప‌వ‌న్ ఈ విష‌యంలో ఏం చేస్తారో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now