Facebook : ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్ మ‌ళ్లీ ప‌నిచేస్తున్నాయ్.. ఎందుకు డౌన్ అయ్యాయంటే.. కార‌ణం ఇదే..!

October 5, 2021 7:45 AM

Facebook : ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌తోపాటు ఇన్‌స్టాగ్రామ్‌, వాటి మాతృసంస్థ అయిన ఫేస్‌బుక్‌లు కొన్ని గంట‌ల పాటు ప‌నిచేయ‌లేదు. ఆయా సోష‌ల్ నెట్‌వ‌ర్క్‌ల సేవ‌లు నిలిచిపోయాయి. భార‌త కాల‌మానం ప్ర‌కారం 04వ తేదీ అక్టోబ‌ర్ 2021 రాత్రి 9.09 గంట‌ల‌కు వీటి సేవ‌లు నిలిచిపోగా.. 05వ తేదీ అక్టోబ‌ర్ 2021 ఉద‌యం 3 గంట‌ల‌కు సేవ‌ల‌ను పున‌రుద్ద‌రించారు. అంటే మొత్తం 6 గంట‌ల పాటు ఈ సంస్థ‌ల సేవ‌లు నిలిచిపోయాయి.

Facebook : ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్ మ‌ళ్లీ ప‌నిచేస్తున్నాయ్.. ఎందుకు డౌన్ అయ్యాయంటే.. కార‌ణం ఇదే..!

ఇంత భారీ ఎత్తున ఫేస్‌బుక్‌కు చెందిన సేవ‌లు నిలిచిపోవ‌డం ఇది రెండోసారి అని చెప్ప‌వ‌చ్చు. గ‌తంలో.. అంటే.. 2019లోనూ ఇలాగే జ‌రిగింది. అప్ప‌ట్లో ఫేస్‌బుక్ సేవ‌లు ఏకంగా 24 గంట‌ల పాటు నిలిచిపోయాయి. అయితే దీనికి కార‌ణం సాంకేతిక స‌మ‌స్యే అని, వాట్సాప్‌పై సైబ‌ర్ అటాక్ దాడి జ‌రిగినందుకు కాద‌ని.. ఫేస్‌బుక్ తెలియ‌జేసింది.

త‌మ డీఎన్ఎస్ సర్వ‌ర్ల‌లో స‌మాచారం ఏమీ లేద‌ని, దీంతో యూజ‌ర్లు ఫేస్‌బుక్‌ను యాక్సెస్ చేసిన‌ప్పుడు అది రాలేద‌ని, అందుక‌నే మూడు నెట్‌వ‌ర్క్‌లు ప‌నిచేయ‌లేద‌ని ఫేస్‌బుక్ తెలిపింది. డీఎన్ఎస్ స‌ర్వ‌ర్ల కాన్ఫిగ‌రేష‌న్‌లో త‌లెత్తిన స‌మ‌స్య వ‌ల్లే ఈ విధంగా సేవ‌ల‌కు అంత‌రాయం ఏర్ప‌డింద‌ని.. ఫేస్‌బుక్ స్పష్టం చేసింది.

అయితే మ‌రో వైపు యూజ‌ర్లు మాత్రం ఇత‌ర సోష‌ల్ మీడియా నెట్‌వ‌ర్క్‌ల‌లో ఫేస్‌బుక్‌, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ల‌పై ట్రోల్స్, మీమ్స్ చేసి వ‌దిలారు. దీంతో అవి వైర‌ల్ అవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now