Liger : వామ్మో.. లైగ‌ర్ మూవీలో మైక్ టైస‌న్‌కు అంత మొత్తం పారితోషిక‌మా ?

October 4, 2021 10:54 PM

Liger : పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టిస్తున్న చిత్రం.. లైగ‌ర్‌. ఈ మూవీ గురించి చిత్ర బృందం ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్‌ను విడుదల చేస్తూ ఉంది. అయితే ఇందులో అంత‌ర్జాతీయ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్ న‌టిస్తున్న విష‌యం విదిత‌మే. ఆయ‌న‌ను అస‌లు ఎలా క‌లిశారు, ఎలా ఒప్పించారు ? అన్న చ‌ర్చే ఇప్ప‌టి వ‌ర‌కు న‌డుస్తూ ఉంది. ఇక ఇప్పుడు తాజాగా ఆయ‌న‌కు ఇస్తున్న పారితోషికం గురించి ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌స్తున్నాయి.

Liger : వామ్మో.. లైగ‌ర్ మూవీలో మైక్ టైస‌న్‌కు అంత మొత్తం పారితోషిక‌మా ?

ఈ మూవీకి గాను విజ‌య్ దేవ‌ర‌కొండ పూర్తిగా అంకితం అయ్యాడు. ఈ మూవీ విడుద‌ల అయ్యే వ‌ర‌కు మ‌రో మూవీని అత‌ను చేయ‌బోవ‌డం లేద‌ని తెలుస్తోంది. దీంతో అత‌ను రెండేళ్ల కాలానికి ఏకంగా రూ.20 కోట్ల వ‌ర‌కు తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. ఇక మైక్ టైస‌న్‌కు విజ‌య్ క‌న్నా ఎక్కువ‌గానే రెమ్యునరేష‌న్ ఇస్తున్న‌ట్లు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. అంటే.. ఆయ‌న‌కు విజ‌య్ క‌న్నా రెండింత‌ల ఎక్కువ మొత్తం అనుకున్నా.. రూ.40 కోట్లు అవుతాయి.

అయితే మైక్ టైస‌న్‌కు రూ.40 కోట్ల మేర పారితోషికం ఇస్తున్నారా, లేదా.. అన్న విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. ఆయ‌న‌కు ఒక వేళ అంత మొత్తం ఇచ్చినా.. పోస్ట‌ర్ల‌లో టైస‌న్ బొమ్మ ఉంటే బిజినెస్ బాగా జ‌రుగుతుంద‌ని నిర్మాత‌లు విశ్వ‌సిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు ఇచ్చే దానిక‌న్నా రెండు మూడు రెట్లు ఎక్కువ మొత్తంలో లాభాలు వ‌స్తాయ‌ని నిర్మాత‌లు ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అందుక‌నే ఆయ‌న‌కు భారీ మొత్తం ముట్ట‌జెప్పి మ‌రీ ఈ సినిమాలో న‌టించేందుకు ఒప్పించిన‌ట్లు తెలుస్తోంది. అయితే లైగ‌ర్ మూవీ ఏ మేర ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను అందుకుంటుంది ? అన్న‌ది తెలియాలంటే.. చిత్రం విడుద‌ల వ‌ర‌కు ఆగాల్సిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now