8 వేలు వచ్చే ఉద్యోగం వదిలేసాడు.. ఇప్పుడు కోట్లకు అధిపతిగా మారాడు!

April 20, 2021 2:20 PM

అదృష్టం ఎప్పుడు ఎవరిని ఏవిధంగా పలకరిస్తుందో ఎవరికీ తెలియదు. ఈ విధంగా అదృష్టం తలుపు తట్టినప్పుడు కోటీశ్వరులుగా మారిపోతుంటారు. ఇలాంటి అదృష్టమే నిఖిల్ కామత్ అనే వ్యక్తికి వచ్చింది. ఒకప్పుడు కేవలం రూ. 8 వేల ఉద్యోగం చేసే నిఖిల్ కామత్ ప్రస్తుతం దేశీ అతిపెద్ద స్టాక్ బ్రోకరేజ్ కంపెనీ జిరోదా కో ఫౌండర్ గా పేరు సంపాదించుకున్నారు. ఈ కంపెనీ ద్వారా దేశంలోని అత్యంత ధనవంతుల్లో నిఖిల్ కామత్ ఒకరిగా నిలిచారు.

ఒకప్పుడు 8 వేల జీతంతో ఒక కాల్ సెంటర్లో పనిచేసిన నిఖిల్ కామత్ అదే సమయంలోనే ట్రేడింగ్ నేర్చుకున్నారు. ఈ ట్రేడింగ్ విధానమే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. 18 సంవత్సరాలకే తన సహోద్యోగులకు కూడా ఆయనకు డబ్బు ఇచ్చి ట్రేడింగ్ చేయమని చెప్పేవారు. వారికి కూడా మంచి లాభాలు వచ్చేవి.

ఈ విధంగా ట్రేడింగ్ ద్వారా మంచి లాభాలు రావడంతో ఉద్యోగం మానేసి తన తమ్ముడు నితిన్ కామత్ తో కలిసి జీరోదా ప్రారంభించారు. ఇది సక్సెస్ కావడంతో దేశంలోనే అత్యంత ధనవంతులలో ఒకరిగా నిలిచారు. ఈ క్రమంలోనే ఫోర్బ్స్ 2020 లిస్ట్‌లో 100 మంది టాప్ సంపన్నుల్లో ఈయన కూడా ఒకరు. ఇలా స్టాక్ మార్కెట్ పుణ్యమా అని రూ.8 వేల నుంచి రూ.కోట్లకు పడగలెత్తారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment