Manchu Vishnu : ప్రచారంలో దూసుకుపోతున్న మంచు విష్ణు.. విజయం ఖాయమే ?

October 4, 2021 7:36 PM

Manchu Vishnu : మంచు విష్ణు అక్టోబర్ 10వ తేదీన జరగబోయే మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ ఎన్నికలలో అధ్యక్ష పదవి బరిలో పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచు విష్ణు ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఈ సందర్భంగా మంచు విష్ణు సీనియర్ హీరోలు అందరినీ కలిసి వారి ఆశీర్వాదం తీసుకుంటున్నారు. గత రెండు రోజుల క్రితం మంచు మనోజ్ తన తండ్రి మోహన్ బాబు, తన ప్యానెల్ సభ్యులతో కలిసి సూపర్ స్టార్ కృష్ణని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.

Manchu Vishnu : ప్రచారంలో దూసుకుపోతున్న మంచు విష్ణు.. విజయం ఖాయమే ?

ఇక నందమూరి నటసింహం బాలకృష్ణను సినిమా సెట్ లో కలిసిన విష్ణు మా ఎన్నికలలో తనకి సపోర్ట్ చేయాలని కోరారు. ఇందుకు బాలకృష్ణ కూడా మద్దతు ఇచ్చారు. దీంతో తనను సపోర్ట్‌ చేస్తున్నందుకు విష్ణు.. బాలకృష్ణకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆయనతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. ఇదిలా ఉండగా మంచు విష్ణు రెబల్ స్టార్ కృష్ణంరాజుని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.

మా ఎన్నికల అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మంచు విష్ణు.. రెబల్ స్టార్ కృష్ణంరాజును కలిసి తన ఆశీర్వాదం తీసుకొని ఆయనతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఇందులో కృష్ణంరాజు సతీమణి కూడా ఉన్నారు. ఈ ఫోటోని షేర్ చేస్తూ.. ఒరిజినల్ రెబల్ స్టార్ ని కలిశాను.. అంటూ విష్ణు క్యాప్షన్ పెట్టారు.

కాగా మంచు విష్ణు ఓ వైపు సినీ ఇండస్ట్రీ పెద్దలను కలిసి రోజు రోజుకీ మద్దతు కూడగడుతుంటే.. మరోవైపు ప్రకాష్‌ రాజ్‌ మాత్రం తనకు ఎలాంటి పెద్దల మద్దతు అవసరం లేదని స్పష్టం చేశారు. అయితే ఈ ఇద్దరిలో మా అధ్యక్షుడిగా ఎవరు గెలుస్తారు ? అన్నది ఉత్కంఠగా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now