Sudigali Sudheer : రాజమౌళి 4 సినిమాలను ఒకే టికెట్ పై చూపించారు..!

October 4, 2021 5:44 PM

Sudigali Sudheer : బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ ప్రేక్షకులను ఎంతో ఎంటర్‌టైన్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాలలో శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకటి. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం ప్రసారం అవుతూ ప్రేక్షకులను ఎంతో సందడి చేస్తోంది. ఈ కార్యక్రమానికి సుడిగాలి సుధీర్ యాంకర్ గా వ్యవహరిస్తుండగా సీనియర్ నటి ఇంద్రజ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా వచ్చేవారం ప్రసారం కాబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు.

Sudigali Sudheer : రాజమౌళి 4 సినిమాలను ఒకే టికెట్ పై చూపించారు..!

వచ్చేవారం దర్శక ధీరుడు, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడు.. ఎస్ఎస్ రాజమౌళి పుట్టిన రోజు కావడంతో ఆయన గురించి స్కిట్ చేశారు. ఈ క్రమంలోనే రాజమౌళి దర్శకత్వం వహించిన నాలుగు బ్లాక్ బస్టర్ చిత్రాలను ఒకే టికెట్ పై చూడాలనుకుంటున్నారా ? అంటూ ఆటో రాంప్రసాద్ ను ఇన్‌వైట్‌ చేస్తారు.

కాగా రాజమౌళి దర్శకత్వం వహించిన మగధీర, విక్రమార్కుడు, మర్యాద రామన్న, ఈగ చిత్రాలను ఆటో రాంప్రసాద్ ఒకే స్కిట్ లో చూపించి ప్రేక్షకులను అలరించాడు. ఇక రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా సెట్ లో కేక్ కట్ చేసి  వేడుకలను జరుపుకున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now