Sai Pallavi : సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న సాయి ప‌ల్ల‌వి..!

October 4, 2021 9:45 AM

Sai Pallavi : ల‌వ్ స్టోరీ మూవీ హిట్ కావ‌డంతో సాయి ప‌ల్ల‌వి ప్ర‌స్తుతం ఆ స‌క్సెస్‌ను ఆస్వాదిస్తోంది. నాగ‌చైత‌న్య‌తో క‌లిసి న‌టించిన మూవీ కావ‌డంతో ప్రేక్ష‌కులు బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే శేఖ‌ర్ క‌మ్ముల ఖాతాలో మ‌రొక హిట్ ప‌డింది. అయితే సినిమాల విష‌యంలో సాయి ప‌ల్ల‌వి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ఆమె తాజాగా మీడియాతో మాట్లాడింది.

Sai Pallavi : సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న సాయి ప‌ల్ల‌వి..!

త‌న చుట్టూ ఉన్న వ్య‌క్తుల‌కు స‌హాయం చేసేందుకు తాను డాక్ట‌ర్‌గా ప‌నిచేద్దామ‌నుకుంటున్న‌ట్లు తెలిపింది. అయితే ఆ స‌మయంలో త‌న‌కు సినిమాల్లో మంచి అవ‌కాశాలు వ‌స్తే క‌చ్చితంగా న‌టిస్తాన‌ని ఆమె తెలిపింది. సినిమాల విష‌యంలో సాయి ప‌ల్ల‌వి ఆచి తూచి అడుగులు వేస్తుంటుంది. తాను గ్లామ‌ర్ షోకు దూరం. క‌నుక సినిమా అవ‌కాశాలు ఆమెకు పెద్ద‌గా రావు. కానీ ఆమె న‌ట‌న‌కు ఎవ‌రైనా ఫిదా కావ‌ల్సిందే. ఇక డ్యాన్స్ అయితే చెప్పాల్సిన ప‌నిలేదు.

సినిమాల విష‌యంలో తాను క‌చ్చితంగా ఉంటాన‌ని సాయిప‌ల్ల‌వి చెప్పింది. ఓ వైపు డాక్ట‌ర్‌గా ప‌నిచేస్తూనే మ‌రోవైపు సినిమాల్లో న‌టిస్తాన‌ని అంటోంది. అయితే ఈ విష‌యంలో ఆమె ఏ మేర స‌క్సెస్ అవుతుంద‌నేది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now