Viral Video : వామ్మో.. చుట్టూ తేనెటీగ‌లు ఉన్నా ఈయ‌న తేనెప‌ట్టు నుంచి తేనెను ఎలా తీస్తున్నాడో చూడండి.. వీడియో..!

January 15, 2026 9:13 PM

Viral Video : తేనె ఎంతో తియ్య‌గా ఉంటుంద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. అందుక‌నే చిన్నారుల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు అంద‌రూ తేనెను ఎంతో ఇష్టంగా తింటారు. ఆయుర్వేద వైద్యంలోనూ తేనెకు ఎంతో ప్రాధాన్య‌త‌ను క‌ల్పించారు. తేనెతో ప‌లు ర‌కాల ఔష‌ధాల‌ను త‌యారు చేయ‌వ‌చ్చు. తేనెను రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి. అయితే తేనెను ఎలా సేక‌రిస్తారో కూడా అంద‌రికీ తెలిసిందే. తేనె ప‌ట్టు నుంచి తేనెను తీస్తారు.

తేనెటీగ‌ల‌ను కొంద‌రు ఫామ్‌ల‌లో పెంచి అవి పెట్టే ప‌ట్టు నుంచి తేనెను సేక‌రించి దాన్ని విక్ర‌యిస్తారు. ఇక మ‌న‌కు అడ‌వుల్లో, గ్రామీణ ప్రాంతాల్లో చెట్ల‌కు స‌హ‌జ‌సిద్ధంగా తేనెతెట్టెల నుంచి కూడా తేనె ల‌భిస్తుంది. అయితే ఇలాగే ఒక వ్య‌క్తి తేనె సేక‌రించాడు. కానీ ఆ వీడియో చూస్తే మాత్రం అంద‌రికీ దిమ్మ తిరిగిపోవ‌డం ఖాయం. ఎందుకంటే చుట్టూ తేనెటీగ‌లు ఉన్నా కూడా ఎలాంటి ర‌క్ష‌ణ ఏర్పాట్లు లేకుండా ఆ వ్య‌క్తి ఎంతో చాక‌చ‌క్యంగా తేనెను తీశాడు. ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా వైర‌ల్ గా మారింది.

Viral Video man extracting honey from honeybee
Viral Video

ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోకుండానే..

ఒక వ్య‌క్తి ఒక చెట్టు కొమ్మ‌ను రెండుగా చీల్చగా అందులో తేనె తెట్టె క‌నిపించింది. దాన్నుంచి అత‌ను తేనెను తీశాడు. అయితే ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోకుండా ఆ వ్య‌క్తి తేనె సేక‌రించడం అంద‌రినీ షాక్‌కు గురి చేస్తోంది. కానీ అత‌నికి అది అల‌వాటే అని ఆ వీడియో ద్వారా మ‌నం అర్థం చేసుకోవ‌చ్చు. ఇక తేనెటీగ‌ల‌ను డిస్ట‌ర్బ్ చేసి తేనెను ఎందుకు సేక‌రిస్తున్నావు.. అని కొంద‌రు జంతు ప్రేమికులు కామెంట్స్ చేయ‌గా.. అత‌ను స‌మాధానం చెప్పాడు.

 

View this post on Instagram

 

A post shared by BAL AVCISI® (@bal_avcisi)

ఇది ప‌రిశుద్ధ‌మైన తేనె. నేను తేనెటీగ‌ల‌ను చంప‌లేదు. అవి మ‌ళ్లీ తెట్టె పెట్టి జీవిస్తాయి. నేను వాటికి ఎలాంటి హాని క‌ల‌గ‌జేయ‌లేదు.. అని రిప్లై ఇచ్చాడు. కాగా ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైర‌ల్ అవుతుండ‌గా.. దీనిపై నెటిజ‌న్లు త‌మకు తోచిన రీతిలో కామెంట్లు చేస్తున్నారు. కొంద‌రు ఈ తేనె కావాల‌ని కోర‌గా.. ఆ వ్య‌క్తి త‌న ఫోన్ నంబ‌ర్‌ను సైతం షేర్ చేయ‌డం విశేషం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now