ఫుట్‌బాల్ ఆడిన ఎలుగుబంట్లు.. వైర‌ల్ వీడియో..!

September 14, 2021 12:23 PM

జంతువులకు కొత్త‌గా ఏదైనా వ‌స్తువు క‌నిపిస్తే అవి మొద‌ట వాటి వ‌ద్ద‌కు వెళ్లేందుకు భ‌య‌ప‌డ‌తాయి. త‌రువాత నెమ్మ‌దిగా వాటి వ‌ద్ద‌కు చేరుకుంటాయి. అవి ఏవైనా ఆట వ‌స్తువులు, క్రీడా వ‌స్తువులు అయితే వాటితో అవి ఆడుకుంటాయి. ఇలాంటి సంఘ‌ట‌న‌ల‌కు చెందిన వీడియోల‌ను ఇప్ప‌టికే మ‌నం ఎన్నింటినో చూశాం. అయితే తాజాగా ఇలాంటిదే ఓ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే..

ఫుట్‌బాల్ ఆడిన ఎలుగుబంట్లు.. వైర‌ల్ వీడియో..!

ఒడిశాలోని న‌బ‌రంగ్‌పూర్ జిల్లాలో ఉన్న ఉమ‌ర్‌కోట్ ప్రాంతంలోని సుకిగావ్ అనే ఏరియాలో అట‌వీ ప్రాంతంలో రెండు ఎలుగు బంట్ల‌కు ఒక ఫుట్ బాల్ క‌నిపించింది. దీంతో అవి దాంతో ఆడుకోవ‌డం మొద‌లు పెట్టాయి. ఎలుగుబంట్లు స‌ర‌దాగా ఫుట్ బాల్ ఆడుతుండ‌డాన్ని గ‌మ‌నించిన స్థానికులు వాటిని వీడియో తీశారు. అనంత‌రం సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా ఆ వీటియో వైర‌ల్‌గా మారింది.

ఆ వీడియోను పోస్ట్ చేశాక కొన్ని గంట‌ల్లోనే దానికి 20వేల‌కు పైగా వ్యూస్ వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే నెటిజ‌న్లు ఆ వీడియోను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. కొంద‌రు ప‌లు కామెంట్లు కూడా పెట్టారు. ప్ర‌భుత్వాలు స‌రిగ్గా ప్రోత్స‌హించాలే కానీ జంతువులు కూడా ఆట‌లు ఆడుతూ ఒలంపిక్స్ లో గెలుస్తాయ‌ని కొంద‌రు కామెంట్లు చేశారు. ఈ క్ర‌మంలోనే ఈ వీడియోను చాలా మంది షేర్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment