Biryani : ఈమధ్య కాలంలో ఎక్కడ చూసినా రెస్టారెంట్లు వెలుస్తున్నాయి. చిన్నపాటి రెస్టారెంట్లను ఓపెన్ చేసి మరీ కస్టమర్లకు పసందైన విందు భోపనాలను వడ్డిస్తున్నారు. ఈ ట్రెండ్ గతంలో నగరాల్లో మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు పట్టణాలు, పల్లెలకు సైతం పాకింది. ఈ క్రమంలోనే రెస్టారెంట్ ఓనర్లు కస్టమర్లను ఆకర్షించేందుకు అనేక ఆఫర్లను కూడా అందిస్తున్నారు. అయితే ఇలాగే అక్కడ కూడా ఓ రెస్టారెంట్ యజమాని తమ బిర్యానీ పబ్లిసిటీ కోసం తాజాగా ఓ వినూత్నమైన కాంపిటీషన్‌ను నిర్వహించాడు. దీనికి అక్కడి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన కూడా లభించింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
తమిళనాడులోని కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ సమీపంలో చీ ఫుడ్ ఎక్స్‌ప్రెస్ అనే రెస్టారెంట్‌ను రీసెంట్‌గా ఓపెన్ చేశారు. కోయంబత్తూర్ రైల్వే స్టేషన్‌లోని ఓ కోచ్‌ను తీసుకువచ్చి దాన్ని రెస్టారెంట్‌గా మార్చారు. అయితే కస్టమర్లను ఆకర్షించేందుకు ఆ రెస్టారెంట్ యజమాని ఓ కాంపిటీషన్‌ను పెట్టాడు. 6 బిర్యానీలను తిన్నవారికి రూ.1 లక్ష నగదు బహుమతిని అందిస్తామని ప్రకటించాడు.
అలాగే 4 బిర్యానీలను తిన్నవారికి రూ.50వేలు, 3 బిర్యానీలను తిన్నవారికి రూ.25 వేలు ఇస్తామని అనౌన్స్ చేశారు. దీంతో ఊహించినదాని కన్నా ఎక్కువగా కస్టమర్లు ఆ రెస్టారెంట్‌కు పోటెత్తారు. సుమారుగా 1000 మందికి పైగాఈ కాంపిటీషన్‌లో పాల్గొన్నారు. అయితే వారు ఎవరూ బిర్యానీలను తినలేకపోయారు. మధ్యాహ్నం 1 గంటకు కాంపిటీషన్ మొదలవ్వగా సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. చివరకు మూర్తి అనే ఒక వ్యక్తి మాత్రం 4 బిర్యానీలను తిన్నాడు. దీంతో అతనికి రెస్టారెంట్ యాజమాన్యం రూ.50వేలను అందజేసింది.
అయితే సదరు వ్యక్తి కొడుకు ఆటిజంతో బాధపడుతున్నాడట. అతని మెడికల్ ఖర్చుల కోసమే తాను ఈ కాంపిటీషన్‌లో పాల్గొన్నానని చెప్పడం అందరినీ కలచివేసింది. ఏది ఏమైనా ఆ రెస్టారెంట్‌కు మాత్రం ఇప్పుడు కస్టమర్లు పోటెత్తుతున్నారు. వ్యాపారం చేయాలనే ఐడియా ఉండాలే కానీ ఇలాంటి ట్రిక్స్‌ను ఎన్నో పాటించి లాభాలను సంపాదించవచ్చు.
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్‌కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం హైబీపీ అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. కొందరికి…