ఈ ఆటో డ్రైవర్ అదృష్టం మామూలుగా లేదు.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు..

September 23, 2021 7:06 PM

సాధారణంగా కొన్నిసార్లు అదృష్టం ఎవరిని ఎటువైపు నుంచి తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు. ఇలా అదృష్టం తలుపు తట్టినప్పుడు కొందరు రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారుతారు. అలాంటి వారిలో కేరళకు చెందిన ఆటో డ్రైవర్ ఒకరని చెప్పవచ్చు. కేరళకు చెందిన జయపాలన్‌ అనే వ్యక్తి ఆటో నడుపుతూ జీవనం కొనసాగించేవాడు. అయితే కేరళలో ఎంతో వేడుకగా జరుపుకునే ఓనం పండుగ సందర్భంగా కొన్ని లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు.

ఈ ఆటో డ్రైవర్ అదృష్టం మామూలుగా లేదు.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు..

ఏదో సరదాగా లాటరీ టికెట్లు కొన్నా అతనికి ఊహించని రీతిలో అదృష్టం తలుపు తట్టింది. ఓనం పర్వదినం సందర్భంగా నిర్వహకులు తిరు ఓనం బంపర్‌ లాటరీ ఫలితాలను సెప్టెంబర్‌ 19న ప్రకటించారు. ఈ లాటరీలో ఆ ఆటో డ్రైవర్ కు ఊహించని రీతిలో బహుమతులు రావడం అతనిని ఎంతో ఆశ్చర్యానికి గురిచేశాయి.

ఈ లాటరీ ఫలితాలను ప్రకటించిన నిర్వాహకులు ఇందులో కేరళకు చెందిన జయపాలన్‌ అనే ఆటోడ్రైవర్ ఏకంగా 12 కోట్ల రూపాయల డబ్బును గెలుచుకున్న టు తెలియడంతో ఆ ఆటో డ్రైవర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇలా సరదాగా కొన్న లాటరీ టికెట్లు నేడు అతనిని కోటీశ్వరుడిని చేసి ఆశ్చర్యానికి గురిచేశాయి. ఇలా ఇప్పటి వరకూ ఎంతోమంది లాటరీ టికెట్లను కొనుగోలు చేసి రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారారు. ఏది ఏమైనా జయపాలన్‌ చాలా లక్కీ అని చెప్పవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment