గేదెపై ఎక్కి బుడ్డోడి స్నానం.. వైరల్ అవుతున్న వీడియో!

August 27, 2021 5:15 PM

ఈ మధ్య ప్రతి ఒక్కరిపై సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంది. స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా బాగా పంచుకుంటున్నారు. ఎక్కడో జరిగిన వింతలు, విశేషాలు ఇలా ప్రతి ఒక్క విషయం సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరికి తెలిసిపోతోంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ బుడ్డోడు గేదె పైకి ఎక్కి స్నానం చేస్తున్న వీడియో తెగ వైరల్ గా మారింది.

భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన రిటైర్మెంట్ తర్వాత సోషల్ మీడియాలో తన అభిమానులతో మరింత దగ్గరగా ఉన్నాడు. ఇక ఆయన ఎప్పటికప్పుడు ఫన్నీ వీడియోలను, ఫోటోలను పంచుకుంటున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా తన సోషల్ మీడియా వేదికగా మరో ఫన్నీ వీడియోను పంచుకోగా వైరల్ గా మారింది.

 అందులో ఓ బుడ్డోడు గేదె పైకి ఎక్కి స్నానం చేస్తున్నాడు. అంతేకాకుండా డ్యాన్స్‌ కూడా చేస్తున్నాడు. ఇక ఈ వీడియోకు ఓ పాట కూడా ఎడిట్ చేయగా నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. దీంతో వీరేంద్ర సెహ్వాగ్‌ ఈ వీడియోతోపాటు ఓ విషయాన్ని పంచుకున్నాడు. గ్రామాల్లో జీవితం సరదాగా ఉంటుందని.. పట్టణాల్లో ఉండే వారికి ఇలాంటి సరదాలు ఉండవని తెలిపాడు.

https://www.instagram.com/reel/CS9HYkyhQJA/?utm_source=ig_web_copy_link

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now