జాలరికి దొరికిన 800 కిలోల అరుదైన చేప..!

August 30, 2021 10:46 PM

కొన్నిసార్లు సముద్రంలో వేటకు వెళ్లిన జాలర్లకు ఎన్నో వింతైన చేపలు వలలో పడుతుంటాయి. అయితే ఈ చేపలు మార్కెట్లో అధిక ధరకు అమ్ముడపోతూ జాలర్లను ఒక్కసారిగా లక్షాధికారులను చేస్తుంటాయి. తాజాగా ఈ విధమైన ఓ అరుదైన చేప బెంగాల్‌లోని దిఘా సముద్ర జలాల్లో ఓ జాలరి వలలో చిక్కుకుంది. ఈ చేపను తీసుకువచ్చి మార్కెట్లో తూకం వేయగా 800 కిలోల బరువు ఉంది.

జాలరికి దొరికిన 800 కిలోల అరుదైన చేప..!

ఈ అరుదైన చేప చూడటానికి స్ట్రింగే చేప ఆకారంలో కనిపించినప్పటికీ ఈ చేపను తెలుగులో టేకు చేప, తిమ్మిరి చేప అని పిలుస్తారు. బెంగాల్ సముద్రతీరంలో ఈ విధమైన చేపలను శంకర్ చేపలు అని కూడా పిలుస్తారు. ఆ జాలరికి ఈ చేపతోపాటు మరో బాఘా శంకర్ ఫిష్ అనే చేప కూడా  దొరికింది. ఆ జాలరి పట్టిన ఈ చేపలలో ఒక దాన్ని కోల్ కతాలోని చాన్ అండ్ కంపెనీ రూ.40 వేలకు కొనుగోలు చేసింది.

రిషికేశ్ శ్యామల అనే మరో వ్యాపారి ఇంకొక చేపను రూ.25 వేలకు కొనుగోలు చేశాడు. అయితే ఈ చేప వింత ఆకారంలో ఉండడంతో దాన్ని చూసి భయపడ్డారు. కానీ ఎంతో ధైర్యంతో ఈ చేపలను పట్టుకుని మార్కెట్ కి తీసుకువచ్చారు. ఈ అరుదైన జాతికి చెందిన చేపలలో ఉండే పదార్థాలతో వివిధ రకాల మందులు, సౌందర్య ఉత్పత్తులను తయారు చేస్తారు. అందువల్ల వీటికి మార్కెట్లో అధిక డిమాండ్ ఉంటుంది. సాధారణంగా ఇలాంటి చేపలను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు. ప్రస్తుతం ఈ చేపకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment