నేల‌పై కూర్చుని భోజ‌నం చేస్తున్న కుటుంబం.. వారి మీద సీలింగ్ ఫ్యాన్ ఊడి ప‌డింది.. వీడియో..

August 25, 2021 1:49 PM

ప్ర‌మాదాలు అనేవి మ‌న‌కు చెప్పివారు. చెప్ప‌కుండానే వ‌స్తాయి. అయితే అలాంటి సంద‌ర్భాల్లో కొన్ని సార్లు కొంద‌రు ల‌క్కీగా బ‌య‌ట ప‌డుతుంటారు. అక్క‌డ కూడా స‌రిగ్గా అలాగే జ‌రిగింది. ఓ కుటుంబం మొత్తం నేల‌పై కూర్చుని ఎంతో స‌ర‌దాగా ముచ్చ‌ట్లు చెప్పుకుంటూ భోజ‌నం చేస్తుండ‌గా.. వారి మీద సీలింగ్ ఫ్యాన్ ఊడి పడింది. కానీ అదృష్ట‌వ‌శాత్తూ ఎవ‌రికీ ఏమీ కాలేదు.

నేల‌పై కూర్చుని భోజ‌నం చేస్తున్న కుటుంబం.. వారి మీద సీలింగ్ ఫ్యాన్ ఊడి ప‌డింది.. వీడియో..

వియ‌త్నాంలోని బాక్ నిహ్ అనే ప్రాంతంలో ఓ కుటుంబంలోని 6 మంది నేల‌పై కూర్చుని భోజ‌నం చేస్తున్నారు. అయితే పైన ఉన్న సీలింగ్ ఫ్యాన్ అక‌స్మాత్తుగా ఊడి వారి మీద ప‌డింది. కానీ ఆశ్చ‌ర్య‌క‌రంగా ఎవ‌రికీ ఏమీ కాలేదు.

అయితే ఆ ఫ్యాన్ ను ఆ కుటుంబ పెద్ద తీసి ప‌క్క‌న పెట్ట‌గా, వారు తిరిగి భోజ‌నం కొన‌సాగించారు. ఆ స‌మ‌యంలో అక్క‌డే ఉన్న సీసీ కెమెరాలో ఆ దృశ్యాలు రికార్డ‌య్యాయి. ఈ సంఘ‌ట‌న జూలై 8, 2021న జ‌ర‌గ్గా ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న‌కు చెందిన ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఆ వీడియోకు ఇప్ప‌టికే 50వేల‌కు పైగా వ్యూస్ వ‌చ్చాయి. ఎంతో మంది కామెంట్లు కూడా చేస్తున్నారు. అదృష్టం కొద్దీ బ‌తికి బ‌య‌ట ప‌డ్డారు.. అని ఊపిరి పీల్చుకుంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment