Vastu Tips : వాస్తు ప్రకారం ఎటు వైపు కూర్చుని భోజనం చెయ్యాలి..? ఎటువైపు కూర్చుని తింటే మంచిది..?

December 20, 2023 9:55 PM

Vastu Tips : చాలామంది, వాస్తు ప్రకారం పాటిస్తూ వుంటారు. మనం వాస్తు ప్రకారం పాటించడం వలన ఎంతో మార్పు ఉంటుంది. ఎంతో మంచి జరుగుతుంది. వాస్తు ప్రకారం పాటించడం వలన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదు. సంతోషంగా ఉండడానికి అవుతుంది. వాస్తు ప్రకారం ఏ దిక్కున కూర్చుని భోజనం చేయాలి, అనే విషయాన్ని కూడా తప్పక తెలుసుకోండి. ఈ పొరపాట్లను చేయకుండా చూసుకున్నట్లయితే, ఎంతో మంచి జరుగుతుంది. ఇబ్బందుల నుండి గట్టెక్కొచ్చు. మనం తీసుకునే ఆహారాన్ని తప్పుగా తీసుకున్నట్లయితే, అనారోగ్య సమస్యలు వస్తాయి.

ఆహారం తినేటప్పుడు కూడా కొన్ని నియమాలని పాటించాలి. ఇలా, మీరు ఆహారాన్ని తీసుకున్నట్లయితే ఇబ్బందులు ఉండవు. సంతోషంగా ఉండొచ్చు. తూర్పు వైపు కూర్చుని భోజనం చేస్తే టెన్షన్, ఒత్తిడి తగ్గిపోతాయి. తూర్పు వైపు కూర్చుని తినడం వలన, మెదడు ఉత్తేజితము అవుతుంది. తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. వృద్ధులకి, రోగులకి ఈ దిశలో భోజనం చేస్తే చాలా మంచిది.

Vastu Tips which side we should turn and take meals
Vastu Tips

డబ్బు, జ్ఞానం, ఆధ్యాత్మిక శక్తి కావాలంటే ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయడం మంచిది. ఇలా, ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయడం వలన కెరియర్లో అభివృద్ధిని పొందవచ్చు. ఉత్తర దిశలో విద్యార్థులు, యువత కూర్చుంటే మరీ మంచిది. పడమర దిక్కున భోజనం చేస్తే కూడా మంచి జరుగుతుంది. వ్యాపారులు పశ్చిమ వైపు కూర్చుని భోజనం చేస్తే, ఎంతో లాభం కలుగుతుంది. దక్షిణ దిక్కు వైపు కూర్చుని భోజనం చేయడం మానుకోవాలి.

ముఖ్యంగా తల్లిదండ్రులు జీవించి ఉన్నట్లయితే, దక్షిణం వైపు కూర్చుని భోజనం చేయకండి. అలానే, వాస్తు శాస్త్రం ప్రకారం భోజనం తినే గది ఇంటికి పశ్చిమ దిశలో ఉండాలి. ఇది మంచిది. దీని వలన లాభం కలుగుతుంది. ఈ దిక్కున కూర్చుని భోజనం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. ఆహారం ఇతర విలువైన వస్తువులకు లోటే ఉండదు. డైనింగ్ టేబుల్ ని ఇంట్లో ఉంచినట్లయితే, దానిని మెయిన్ డోర్ లేదా టాయిలెట్ ముందు పెట్టకండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now