Stars : ఈ న‌క్ష‌త్రాల్లో పుట్టిన వారు అదృష్ట‌వంతులు, ధ‌న‌వంతులు అవుతారు.. మీది ఏ న‌క్ష‌త్రం..?

November 27, 2023 5:26 PM

Stars : మనకి మొత్తం 27 నక్షత్రాలు ఉన్నాయి. మన నక్షత్రం ప్రకారం కూడా, చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఏ నక్షత్రంలో పుట్టామనేది చూసుకుని, మన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే అంచనా కూడా వేసుకోవచ్చు. రాశులను బట్టి, నక్షత్రాలను బట్టి మనం భవిష్యత్తుని ముందే తెలుసుకుని, దానికి తగ్గట్టుగా మనం నడుచుకోవచ్చు. నాలుగవ నక్షత్రం రోహిణి. చంద్రునిచే పాలించబడుతుంది. పెరుగుదల, సంతనోత్పత్తిని సూచిస్తుంది. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు, అద్భుతమైన వ్యాపార జ్ఞానాన్ని కలిగి ఉంటారు.

జీవితంలో అనేక అంశాల మీద, వీళ్ళకి అవగాహన ఎక్కువ ఉంటుంది. ఉత్తరబాధ్ర నక్షత్రం వాళ్లు క్రమశిక్షణ, పట్టుదలతో ఉంటారు. 26వ నక్షత్రం ఇది. ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్లు, ఆర్థిక ప్రణాళిక వేసుకుంటారు. వీళ్ళ సంకల్పం వీళ్ళని గొప్ప శ్రేయస్సు, ఆర్థిక భద్రతను సాధించడానికి దారితీస్తుంది. ఆఖరి నక్షత్రం రేవతి. రేవతి నక్షత్రం వాళ్ళు ఇతరులకి సహాయం చేస్తారు. ఈ నక్షత్రం వాళ్లు పరిస్థితులకు అనుకూలంగా నడుచుకోగలరు. బాగా డబ్బుల్ని కూడా దాచుకోగలుగుతారు.

people born in these 7 stars will become wealthy and lucky
Stars

అలానే 13వ నక్షత్రం హస్త నక్షత్రం. చంద్రునిచే పాలించబడుతుంది. నైపుణ్యం కలిగిన వాళ్లు వీళ్లు. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు వ్యాపారము లో బాగా రాణించగలుగుతారు. వీళ్ళకి బాధ్యత కూడా ఎక్కువ. డబ్బులు బాగా కూడబెట్టగలరు. హస్త నక్షత్రం వాళ్ళు 11 వ నక్షత్రం. పుబ్బ నక్షత్రం శ్రేయస్సు, లగ్జరీ భౌతిక సౌకర్యాలని సూచిస్తుంది. ఆడంబరమైన వ్యక్తిత్వంతో వీళ్ళు ఉంటారు. గొప్ప తేజస్సు కలవారు.

అలానే, ఎనిమిదవ నక్షత్రం పూర్వాషాడ. పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వాళ్లు, బాధ్యతతో ఉంటారు. ఇతరులకు సహాయం చేస్తారు. మంచిగా సంపాదిస్తారు. వీళ్ళ యొక్క కష్టమే, వీళ్ళని పెద్ద ఎత్తులో నిలబెడుతుంది. అలానే పుష్యమి నక్షత్రం వాళ్ళు, ఎటువంటి అడ్డంకులను అయినా సరే ఎదుర్కోగలుగుతారు. వాటిని దాటేసి, మంచి జీవితాన్ని పొందుతారు. ఈ నక్షత్రం వాళ్లకి పట్టుదల కూడా ఎక్కువ.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now