Lemon For Vastu : నిమ్మకాయతో ఇలా చేయండి.. మీకు తిరుగు ఉండదు.. ధనవంతులు అయిపోవచ్చు..!

September 24, 2023 4:15 PM

Lemon For Vastu : చాలా విషయాలను మనం పట్టించుకోము. కానీ. మనం పట్టించుకోని కొన్ని విషయాల వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాస్తు ప్రకారం పాటించడం, మంచి, చెడు చూసుకోవడం, ఎలాంటి తప్పులు చేయకూడదు అనేది కూడా తెలుసుకోవడం వంటివి ఈ రోజుల్లో చాలా మంది చేస్తున్నారు. మన ఇంట్లో, ఎన్నో వస్తువులు ఉంటుంటాయి. కానీ, మనం ఎక్కువ పట్టించుకోము, నిజానికి మన ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులు జీవితానికి, భవిష్యత్తుకి మంచి ఫలితాన్ని ఇస్తాయి.

నిమ్మకాయతో పరిహారాలు చాలా ప్రభావితమైనవి. ఎన్నో శుభ ఫలితాలను నిమ్మకాయలు మన జీవితంలోకి తీసుకువస్తాయి. ఈరోజు మనం నిమ్మకాయకు సంబంధించిన నియమాలు, నివారణలను సరిగ్గా ఎలా పాటించాలి..?, అవి ఎలా మన జీవితంలో ఇబ్బందుల్ని తొలగించేస్తాయి…?, ఎటువంటి ఫలితం మనకి వస్తుంది అనే ముఖ్య విషయాలను తెలుసుకుందాం. మన మీద, మన ఇంట్లో చెడు దృష్టి తొలగించడానికి నిమ్మకాయ బాగా ఉపయోగపడుతుంది.

Lemon For Vastu use them like this for wealth and luck
Lemon For Vastu

ఆర్థిక పరిస్థితిని నిమ్మకాయతో మెరుగుపరచుకోవచ్చు. ధన లాభం ని నిమ్మకాయ కలిగిస్తుంది. కష్టపడి పనిచేసినా కూడా పనిలో విజయం రావట్లేదంటే ఇలా చేయండి. నిమ్మకాయలో నాలుగు లవంగాలు గుచ్చి, హనుమంతుడి ఆలయానికి దానిని తీసుకువెళ్లి హనుమంతుడికి సమర్పించండి. ఆ తర్వాత హనుమాన్ చాలీసాని చదువుకోండి. ఈ పరిహారం తో ప్రతి ప్రయత్నాల్లో కూడా మీరు విజయం సాధించవచ్చు. ఓటమనేది మీకు ఉండదు.

నిమ్మకాయలు అంటే శక్తి స్వరూపిణి ఆయన పార్వతికి చాలా ఇష్టం. నిమ్మకాయలతో చేసిన దండని పార్వతి దేవికి సమర్పిస్తే, ఐశ్వర్యం కలుగుతుంది. మీరు డబ్బు నష్టంతో బాధపడుతున్నట్లయితే, నిమ్మకాయని ఇంటికి నాలుగు మూలల్లో ఏడుసార్లు తిప్పి, తర్వాత ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్లి, నాలుగు ముక్కలు కింద చేసి, నాలుగు దిక్కులకి ఆ ముక్కల్ని వేయండి. ఈ విధంగా ఆచరిస్తే చెడు దృష్టి పోతుంది. అధిక నష్టాలు, కష్టాలు నుండి బయటపడొచ్చు.

వ్యాపారంలో పురోగతి కోసం, ఆదివారం నాడు ఐదు నిమ్మకాయల్ని కోసి, వాటిలో కొన్ని నల్ల మిరియాలు, కొన్ని ఆవాలు వేసి… మీరు పని చేసే చోట పెట్టండి. మరుసటి రోజు ఉదయం వీటిని తీసుకువెళ్లి, ఎవరూ లేని చోట వదిలేసి వచ్చేయండి. ఒక గాజు గ్లాసులో నీళ్లు పోసి, పండిన నిమ్మకాయను వేసి, ఇంటి ఈశాన్యం మూలలో పెడితే ఆర్థిక ప్రయోజనాలను పొందొచ్చు. ఇలా, ఈ విధంగా నిమ్మకాయతో మనం చాలా సమస్యల నుండి బయట పడవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment