Lakshmi Devi : లక్ష్మీదేవిని పూజిస్తే ధనంతోపాటు శుభాలు కూడా కలుగుతాయని అందరికీ తెలిసిందే. ఎందుకంటే హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ధనానికి, ఐశ్వర్యానికి అధిపతి. ఆమెను పూజిస్తే అన్నీ శుభాలే కలుగుతాయని, ధనం మిక్కిలిగా సమకూరుతుందని చాలా మంది నమ్మకం. వ్యాపారస్తులైతే తమ దుకాణాల్లో, షాపులలో, ఇతర ప్రదేశాల్లో లక్ష్మీదేవి చిత్రపటాన్ని కచ్చితంగా పెట్టుకుంటారు. అలా చేస్తే వ్యాపారంలో బాగా డబ్బు సంపాదించవచ్చని వారి నమ్మకం. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధించాలంటే పూజ మాత్రమే కాదు, ఇంకా కొన్ని పనులు కూడా చేయాల్సి ఉంటుందట. అప్పుడు ఆ దేవి కటాక్షం ఇంకా ఎక్కువగా కలుగుతుందట. ఈ క్రమంలో లక్ష్మీదేవి కోసం ఏమేం పనులు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఓ నెమలి ఫించాన్ని తెచ్చుకుని దాన్ని ఇంట్లో మీరు లక్ష్మీదేవిని పూజించే దగ్గర పెట్టుకోవాలి. దీంతో ఆ దేవి అనుగ్రహం లభిస్తుందట. ఎందుకంటే సరస్వతీ దేవి కూర్చునేది నెమలిపైనే కదా. అంతేకాదు, నెమలి ఫించాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల నెగెటివ్ శక్తి అంతా వెళ్లిపోయి, పాజిటివ్ శక్తి వస్తుందట. అది మనకు చాలా మేలు చేస్తుందట. బంగారం లేదా వెండితో చేసిన నాణాన్ని పూజ గదిలో ఉంచాలి. ఆ నాణంపై లక్ష్మీ దేవి, వినాయకుడు ఉంటే ఇంకా చాలా మంచిదట. దాంతో మిక్కిలిగా సంపద కలుగుతుందట. తామర పూవులంటే లక్ష్మీ దేవికి ఎంతో ఇష్టమట. ఆ దేవి తామరపూవు పైనే కూర్చుంటుంది కాబట్టి దాంతో ఆమెను పూజిస్తుంటే అన్నీ లాభాలే కలుగుతాయట. ధనం బాగా సమకూరుతుందట.
లక్ష్మీదేవి తామరపూవు మీద కూర్చుని ఉండి సిరులు కురిపిస్తున్నట్టుగా ఉంటే చిత్రపటం లేదా ప్రతిమను ఇంట్లో పెట్టుకుని నిత్యం పూజించాలి. దీంతో సిరులు కురుస్తాయట. ఇంట్లోని వారందరికీ అంతా మంచే జరుగుతుందట. మహిళలు నుదుట ధరించే కుంకుమ, చేతులకు ధరించే గాజులు, గోరింటాకు వంటి పలు రకాల అలంకరణ వస్తువులను ఇంట్లో ఉంచాలట. దీంతో ఆ ఇంట్లోని వారికి అంతా మంచే జరిగి సంపద సిద్దిస్తుందట.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…