Wealth : పొరపాటున కూడా ఈ తప్పులు చెయ్యకండి.. మీ సంపద మొత్తం పోతుంది..!

June 24, 2023 7:59 AM

Wealth : చాలా మంది ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఎంతో సంపాదిస్తూ ఉంటారు అయితే వచ్చిన సంపద అంతా కూడా మంచి నీళ్లలా ఖర్చు అయిపోవడం లేదంటే సంపదని కోల్పోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. అయితే సంపద నశించడానికి ముఖ్య కారణాలు ఇవే.. ఈ పొరపాట్లు జరగకుండా చూసుకోండి. అప్పుడు అంతా మంచే జరుగుతుంది మీ సంపద అలానే ఉంటుంది.

చాలా మంది పసుపు కుంకుమ రాసిన గుమ్మం మీద కాలును మోపి ఆ ఇంట్లోకి వెళుతూ ఉంటారు ఈ తప్పును చేస్తే కచ్చితంగా సంపద పోతుంది. ఈ పొరపాటును ఎప్పుడూ కూడా ఎవరూ చేయకూడదు. అదే విధంగా బీరువా తలుపులు ఎక్కువ సమయం తెరిచి ఉంచడం తాళం వేయకుండా అలా వదిలేయడం వంటివి చేస్తే కూడా సంపద ని కోల్పోవాల్సి ఉంటుంది. కనుక ఈ తప్పును కూడా ఎప్పుడు చేయకండి.

if you do these mistakes your wealth will be gone
Wealth

మాసిన బట్టల్ని అస్సలు బీరువాలో పెట్టకండి మాసిన బట్టలని బీరువాలో పెట్టడం వలన మీ సంపద తరిగిపోతుంది. ఉగాది పర్వదిన రోజున గుమ్మానికి తోరణాలు కట్టకుండా ఉంటే కూడా లక్ష్మీ కటాక్షం లభించదు. ఖర్చులు ఎక్కువైపోతాయి. సంపద పోతుంది. ఇంటి గృహిణి గా ఉండే స్త్రీ గాజులని వేసుకోక పోతే అప్పులు బాగా పెరిగిపోతాయి. కాలి చెప్పులని ఇంట్లో పెట్టినా సింహద్వారానికి ఎదురుగా ఉంచినా కూడా సంపద మొత్తం పోతుంది.

తడి కాళ్ల తో మంచం మీద నిద్రపోతే అప్పులు బాగా పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలానే ఇంటికి వచ్చిన బిచ్చగాడికి ఆహారం అందించకపోయినా మూగజీవికి ఆహారం పెట్టకపోయినా ఏడు జన్మల ద‌రిద్రం అనుభవించాల్సి ఉంటుంది. గురువులను అవమానించినా దూషించినా దోషము కలిగి సంపద మొత్తం పోతుంది ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment