Zodiac Signs : మనం పుట్టిన తేదీ బట్టి మనకు ఒక రాశి ఉంటుంది. అలా మొత్తం 12 రాశులు ఉంటాయి. మన రాశిని బట్టి మన వ్యక్తిత్వం ఏంటో కూడా తెలుసుకోవచ్చు. కొందరేమో సహజ కళాకారులు, కొందరు ప్రేమికులు. అయితే కొందరేమో పుట్టినప్పటి నుండి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. మరి వారు ఏ రాశివారో ఇప్పుడు తెలుసుకుందామా..!
రాశులవారీగా తీసుకుంటే ప్రథమ రాశి మేషం. ఈ రాశిని అగ్నితత్త్వంతో పోలుస్తారు. భగభగమండే తత్త్వంతో ఉండి కోపాన్ని, పౌరుషాన్ని ప్రదర్శిస్తారు. తోచిన విధంగా ప్రవర్తించడం వంటి లక్షణాలతో ఉంటారు. ఈ రాశికి కుజుడు అధిపతి. చర రాశి అయినందున స్థిరమైన ఆలోచన ఉండదు. చకచకా ఆలోచనలు, నిర్ణయాలు మారిపోతుంటాయి. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. అగ్నితత్త్వం అయినందున ఆయా ఆలోచనలు వేగంగా రూపాంతరం చెందడం ఈ రాశివారిలో అత్యంత సహజం. నాయకత్వం వహించాలనే తపన, తొందరపాటుతనం కనిపిస్తాయి.
వృషభ రాశికి చెందిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేవరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి అందాన్ని ఆరాధించే హృదయం కలిగి సంగీతాన్ని ఆస్వాదిస్తారు. తాము ఏ స్థాయిలో ప్రేమిస్తున్నారో అదేస్థాయిలో ఎదుటి వ్యక్తి నుంచి ప్రేమను ఆశిస్తారు. ఈ రాశి పురుషులకు సహనమనే గుణం అలంకారం అని చెప్పవచ్చు. ఈ గుణం వల్ల వీరు ఫలితాల కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తారు. ఎలాంటి చికాకులనైనా ఎదుర్కొంటారు.
సింహం రాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు. అభివృద్ధి సాధించాలన్న తపన సుఖ జీవితానికి దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్ఠకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాలలో సమర్ధులుగా పేరు గడిస్తారు. వంశ ప్రతిష్ఠ, కుల గౌరవాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇతర కుల, మత, వర్గాలను ద్వేషించరు. చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం రాదు. కఠినమైన స్వభావం కలవారన్న ముద్ర పడుతుంది. సన్ని హితులు, సేవకా వర్గం వీరి చేత కొంత ఆలస్యంగా అయినా పని చేయించుకోగలుగుతారు. వీరిని భయపెట్టి లొంగదీసుకోవడం దాదాపు అసాధ్యం అనే చెప్పాలి.
రాశి చక్రంలో పదవ స్థానంలో ఉన్న మకర రాశి 270 డిగ్రీల నుండి 300 డిగ్రీల వరకు వ్యాపించి ఉంటుంది. ఈ రాశిని సరి రాశిగాను, శుభ రాశి గాను, స్త్రీ రాశిగాను, చర రాశిగానూ వ్యవహరిస్తారు. ఈ రాశి పాలకులను, పాలనాధికారులను, హస్వ స్వరూపులను సూచిస్తుంది. కనుక వీరు కూడా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. అందరినీ పాలిస్తారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…