Lakshmi Devi And Money : మీ జాత‌కంలో ఈ యోగం ఉందా.. అయితే ల‌క్ష్మీదేవి మీ వెంటే ఉంటుంది..!

November 30, 2023 7:30 PM

Lakshmi Devi And Money : జాతకంలో, అద్భుతమైన యోగాలు ఏర్పడినప్పుడు, అది మనిషి జీవితంలో ఎంతో మంచిది కలిగిస్తుంది. యోగాలలో చామర యోగం అనేది కూడా ఒకటి. జాతకంలో చామర యోగం ఉన్నట్లయితే, వాళ్లని ఎంతగానో గౌరవిస్తారు. ప్రతి రంగంలో కూడా, విజయాన్ని అందుకుంటారు. చామర యోగాన్ని రాజయోగం అని కూడా అంటారు. ఈ యోగంలో పుట్టిన వ్యక్తి రాజులా జీవిస్తాడు. ఈ చామర యోగం అంటే ఏంటి అనే విషయాన్ని, దానికి సంబంధించిన వివరాలను ఇప్పుడే మనం చూద్దాం.

మనిషి జీవితంలో చామర యోగం కనుక ఏర్పడినట్లయితే, ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. లగ్నాధిపతి అంటే లగ్నము ఒకటవ ఇంట, ఉచ్చమైన రాశిలో ఉండి, బృహస్పతి దృష్టిలో ఉన్నప్పుడు, చామర యోగం ఏర్పడుతుంది. చంద్రుడు మొదటి ఇంటికి అధిపతి. దాని ముఖ్యమైన రాశిలో అంటే, వృషభ రాశిలో ఉన్నందున, బృహస్పతి దానిని చూసినప్పుడు, చామరియోగం అనేది ఏర్పడుతుంది.

chamara yogam Lakshmi Devi And Money
Lakshmi Devi And Money

ఈ చామరం యోగం ఏర్పడినప్పుడు ఏమవుతుంది అనేది చూస్తే.. నాయకుడు లేదా నాయకుడు వంటి స్థానాన్ని పొందేలా ఇది చేస్తుంది. ప్రభుత్వం నుండి గౌరవం కూడా కలుగుతుంది. ఆలోచనలు చాలా క్లియర్ గా ఉంటాయి. తెలివైన నిర్ణయాలను వీళ్ళు తీసుకుంటారు. అదృష్టం ఎప్పుడూ కూడా వెంటే ఉంటుంది. ఏ సమస్య రాదు.

ఏ విజయాన్ని అయినా సరే, అందుకోగలుగుతారు. ఓటమి అనేది ఉండదు. అలానే, కళలలో ఉన్న వాళ్ళను, నిష్ణాతులు చేస్తుంది. ఈ యోగం ఏర్పడితే వేదాలు, శాస్త్రాలు అర్థం చేసుకునే వక్త కూడా అయిపోవచ్చు. సమాజంలో గౌరవం, పేరు తెచ్చుకోవడానికి కూడా విజయ శిఖరాలను చేరుస్తుంది. ఈ యోగాన్ని అందుకోవడానికి నిజాయితీ మార్గాన్ని అనుసరించండి. ఏ స్థానంలో వున్నా, ఏ అధికారంలో వున్నా, దుర్వినియోగాన్ని మాత్రం చేసుకోవద్దు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now