జ్యోతిష్యం & వాస్తు

Dogs : మ‌న‌కు జ‌ర‌గ‌బోయే కీడు కుక్క‌ల‌కు ముందే తెలుస్తుందా..? అవి ఎలా ప్ర‌వ‌ర్తిస్తాయి..!

Dogs : మ‌నం ఇంట్లో పెంచుకోద‌గిన జంతువుల‌ల్లో కుక్క‌లు కూడా ఒక‌టి. కుక్క‌ల‌ను చాలా మంది ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. అలాగే మ‌నిషి కంటే కుక్క‌ల‌కే విశ్వాసం ఎక్కువ‌గా ఉంటుంద‌ని అనే నానుడిని కూడా మ‌నం వింటూనే ఉంటాం. కుక్క‌ల‌కు ముందుగానే జ‌ర‌గ‌బోయే వాటిని గ్ర‌హించే శ‌క్తి కూడా ఉంటుంద‌ని మ‌న పెద్ద‌లు చెబుతూ ఉంటారు. అలాగే కుక్కశ‌కునం కూడా కుక్క‌ల‌కు సంబంధించిన మ‌న‌కు అనేక విష‌యాల‌ను మ‌న‌కు తెలియ‌జేస్తుంది. కుక్క‌శ‌కునంలో ఉన్న అనేక విష‌యాల‌ల్లో కొన్నింటి గురించి ఈ రోజు మ‌నం తెలుసుకుందాం. మ‌నం బ‌య‌ట‌కు వెళ్లేట‌ప్పుడు ఎదురుగా వ‌చ్చే కుక్క క‌నిపించే విధానాన్ని బ‌ట్టి మ‌న‌కు ఎటువంటి ఫ‌లితాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

కుక్క‌కు మనం ఇచ్చిన ఆహారాన్ని తిని ఆ కుక్క త‌న కాలితో కుడి వైపు గోక్కుంటే మ‌న‌కు శుభం క‌లుగుతుంది. అలాగే ఎడ‌మ కాలితో కుడి వైపు అవ‌య‌వాల‌ను, కుడి కాలితో ఎడ‌మ వైపు అవ‌య‌వాల‌ను తాకితే అది మ‌న‌కు శుభం కాద‌ని కుక్క శ‌కునం చెబుతుంది. అదే విధంగా ఊరికి వెళ్లేట‌ప్పుడు కుక్క నోటితో రోటి, మిఠాయి. మాంసం వంటి వాటిని ప‌ట్టుకుని క‌నిపిస్తే మ‌న‌కు ధ‌న‌లాభం క‌లుగుతుంది. అలాగే కుక్క ఎత్తుగా ఉండే ప్రదేశంలో కూర్చుని కుడి కాలితో త‌ల‌ను తాకితే కార్య సిద్ది క‌లుగుతుంద‌ని న‌మ్ముతారు. అలాగే కుక్క త‌న కుడి కంటితో ప్ర‌వాస వ్య‌క్తిని చూస్తే క‌ఠిణ‌మైన ప‌నులు కూడా సుల‌భంగా జ‌రుగుతాయని న‌మ్ముతారు. అదే విధంగా బ‌య‌ట‌కు వెళ్లేట‌ప్పుడు కుక్క నోటిలో ఎముక ప‌ట్టుకుని ఎదురు వ‌స్తే మృత్యు స‌మాన‌మైన క‌ష్టం క‌లుగుతుంద‌ని కుక్క శ‌కునం చెబుతుంది. అలాగే ప్ర‌యాణాల‌కు వెళ్లేట‌ప్పుడు అవిటి కుక్క క‌నిపించినా కూడా కార్య‌సిద్ది జ‌ర‌గ‌ద‌ని కుక్క శ‌కునం తెలియ‌జేస్తుంది. అలాగే ప్ర‌యాణాల‌కు వెళ్లేట‌ప్పుడు నీటిలో నుండి వ‌చ్చే కుక్క నీటిని విదిలించిన‌ట్టు క‌నిపిస్తే ప్రయాణాల్లో దొంగ‌ల నుండి జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని చెబుతూ ఉంటారు.

Dogs

అదే విధంగా కుక్క మ‌న చెప్పుల‌ను తీసుకెళ్లిన లేదా ఇత‌రుల చెప్పుల‌ను తెచ్చి మ ఇంట్లో పెట్టిన దొంగ‌ల నుండి జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని చెబుతుంటారు. అలాగే కుక్క ఎవ‌రినైనా చూసి గుర్రు.. గుర్రు అనే శ‌బ్దం చేస్తే వారికి ధ‌న హాని క‌లుగుతుంది. అలాగే కుక్క ఎవ‌రి ద‌గ్గ‌రికైనా వెళ్లి వారిని వాస‌న చూస్తే వారు త్వ‌ర‌లో ప్ర‌యాణం చేయాల్సి వ‌స్తుంద‌ట‌. అలాగే కుక్క పురుషుల‌ను కుడి వైపు గోక్కోవ‌డం వ‌ల్ల స్త్రీల‌ను చూసి ఎడ‌మ‌వైపు గోక్కోవ‌డం వ‌ల్ల మంచి జ‌రుగుతుంద‌ని న‌మ్ముతారు. అలాగే ఇంట్లో ఉండే ఆకాశాన్ని, పేడ‌ను, మ‌లాన్ని త‌దేకంగా చూడ‌డం వ‌ల్ల ఇంట్లోని వారికి ధ‌న లాభం క‌లుగుతుంద‌ట‌. ప్ర‌యాణాల‌కు వెళ్లేట‌ప్పుడు కుక్క మూత్ర విస‌ర్జ‌న చేయ‌డాన్ని చూస్తే అనుకున్న ప‌నులు జ‌ర‌గ‌వ‌ట‌. కుక్క కంటి నుండి నీరు కారితే అది శుభానికి సంకేతం అని శ‌కున శాస్త్రం తెలియ‌జేస్తుంది. అలాగే ఇంటి గోడ‌ల‌కు కుక్క కాళ్ల‌తో త‌దేకంగా తాకుతూ ఉంటే ఆ ఇంట్లో దొంగ‌త‌నం ఖ‌చ్చితంగా జ‌రుగుతుంద‌ని న‌మ్ముతారు. ఈ విధంగా కుక్క చేసే ప్ర‌తి ప‌నిలో కూడా ఏదో ఒక అర్థం ఉంటుంద‌ని శ‌కున శాస్త్రం తెలియ‌జేస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM