దేశంలోనే అతి పెద్ద బ్యాంకింగ్ సంస్థ ఎస్‌బీఐ తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ఎస్‌బీఐ కస్టమర్లు ఇకపై తమ బ్యాంక్ బ్రాంచ్‌ను మార్చుకోవాలనుకుంటే బ్యాంకు దాకా వెళ్లాల్సిన పనిలేదు. ఆన్‌లైన్‌లోనే పని పూర్తవుతుంది. అవును. ఎస్‌బీఐ కస్టమర్లు ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్‌కు మారాలనుకుంటే ఆన్‌లైన్‌లోనే రిక్వెస్ట్ పెట్టి పని పూర్తి చేసుకోవచ్చు. కరోనా నేపథ్యంలోనే ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నామని ఎస్‌బీఐ తెలియజేసింది.
1. ముందుగా onlinesbi.com అనే సైట్‌ను సందర్శించాలి.
2. అందులో పర్సనల్ బ్యాంకింగ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
3. యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌పై క్లిక్ చేయాలి.
4. అనంతరం వచ్చే ఆప్షన్లలో ఇ-సర్వీస్ ట్యాబ్‌ను ఎంచుకుని దానిపై క్లిక్ చేయాలి.
5. ట్రాన్స్‌ఫర్ సేవింగ్స్ అకౌంట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
6. ట్రాన్స్‌ఫర్ చేయాలనుకున్న అకౌంట్‌ను ఎంచుకోవాలి.
7. ఏ బ్రాంచ్‌కు అయితే మారాలనుకుంటున్నారో ఆ బ్రాంచ్‌కు చెందిన ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌ను ఎంటర్ చేయాలి.
8. ఒకసారి వివరాలు అన్నింటినీ చెక్ చేసుకుని కన్‌ఫాం బటన్‌పై క్లిక్ చేయాలి.
9. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి కన్‌ఫాం చేయాలి.
10. కొన్ని రోజుల తరువాత మీరు కావాలనుకున్న బ్రాంచ్‌కు మీ అకౌంట్ మారుతుంది.
ఇక యోనో యాప్ లేదా యోనో లైట్ యాప్‌లను వాడేవారు కూడా మీ అకౌంట్ బ్రాంచ్‌ను మార్చుకోవచ్చు. అందుకు మొబైల్ నంబర్ కచ్చితంగా బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయి ఉండాలి. లేదంటే ఓటీపీ రాదు. కాగా కరోనా నేపథ్యంలో ఎస్‌బీఐ ఇప్పటికే చాలా సేవలను ఆన్‌లైన్ ద్వారానే అందిస్తోంది. అందులో భాగంగానే అకౌంట్ ట్రాన్స్ ఫర్ సేవను కూడా ఆన్‌లైన్ చేసింది. దీంతో ఖాతాదారులు తమ అకౌంట్ ను ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్‌కు సులభంగా మార్చుకోవచ్చు.
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్‌కు…
రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్‌ను…
శ్రీ విష్ణు, నయనా సరిక ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు విన్యాసం చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చింది.…
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…