కస్టమర్లకు శుభవార్త.. అందుబాటులోకి పోస్టాఫీస్ కొత్త సేవలు..!

September 13, 2021 10:40 PM

ప్రస్తుతం కస్టమర్లకు ఎన్నో పోస్టాఫీస్ పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలోనే కస్టమర్లకు మరి కొన్ని పథకాలను పోస్టాఫీస్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటి వరకు ఏదైనా అమౌంట్ విత్ డ్రా చేయాలన్నా, డిపాజిట్ చేయాలన్నా కస్టమర్లు పోస్టాఫీస్ కు వెళ్లాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు కస్టమర్ లు బ్రాంచ్ కి వెళ్ళకుండా ఈ సేవలను ఎంతో సులభంగా పొందవచ్చు. అయితే ఈ సేవలు అందరికీ వర్తించవు.

కస్టమర్లకు శుభవార్త.. అందుబాటులోకి పోస్టాఫీస్ కొత్త సేవలు..!

పోస్టాఫీస్ ఈ సేవలను వికలాంగులు, సీనియర్ సిటిజన్ లకు మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చింది. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్స్, సేవింగ్స్ అకౌంట్స్ వంటి పలు స్మాల్ సేవింగ్స్ డిపాజిట్ ల నుంచి డబ్బులను విత్‌డ్రా చేసుకోవడం లేదా క్లోజ్ చేయడం వంటివి ఇకపై ఎంతో సులభంగా చేసుకోవచ్చు.

ఇంతకు మునుపు ఈ విధమైన సేవలు లేకపోయినప్పటికీ ప్రస్తుతం ఈ సేవలను పొందాలంటే ముందుగా పోస్టాఫీస్ కి వెళ్లి ఫామ్ ఎస్‌బీ 12ని నింపి సంబంధిత అధికారికి ఇవ్వాల్సి ఉంటుంది. మీ తరపున లావాదేవీలను నిర్వహించడానికి మరొక అధికారిని నియమిస్తారు. ఈ అధికారి సమక్షంలో మీ ఆర్థిక లావాదేవీల ట్రాన్సాక్షన్స్ వాళ్లే చూసుకుంటారు. కనుక ఈ సరికొత్త పథకం ద్వారా సీనియర్ సిటిజన్లకు, వికలాంగులకు తరచూ పోస్టాఫీస్ బ్రాంచ్ చుట్టూ తిరిగే శ్రమ ఉండదని చెప్పవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment