RBI Rule : రిజర్వ్ బ్యాంక్ కొత్త రూల్.. లాకర్ లో బంగారం పెట్టుకుంటే.. తప్పక తెలుసుకోండి..!

November 9, 2023 11:30 AM

RBI Rule : బంగారం అనేది మన లెవెల్ ని చూపిస్తుంది. ఆడవాళ్లు ముఖ్యంగా, బంగారు నగల్ని ఎక్కువగా కొనుగోలు చేయడానికి, ఇష్టపడుతూ ఉంటారు. రకరకాల బంగారు నగలని కొంటూ ఉంటారు. డబ్బులు దాచుకుని, చాలా మంది బంగారని కొంటూ ఉంటారు. బంగారాన్ని కొనడం అంత ఈజీ కాదు. రూపాయి రూపాయి దాచుకుని కొనుక్కోవాలి. చాలామంది బంగారాన్ని ఇంట్లో పెట్టుకోరు. బంగారం, ముఖ్యమైన డాక్యుమెంట్లు, డబ్బులు ఇటువంటివన్నీ కూడా లాకర్ల లో దాచుకుంటూ ఉంటారు. చాలామంది ఇంట్లో పెట్టడం సురక్షితం కాదని, చాలా మంది బ్యాంక్ లాకర్ లలో డబ్బులు, బంగారం వంటివి పెడుతూ ఉంటారు.

లాకర్ ఫెసిలిటీస్ అన్ని బ్యాంకుల్లో అందుబాటులో ఉంటాయి. ఖాతాదారులు వారి విలువైన ఆస్తులని నిల్వ చేసుకోవడానికి, లాకర్ బాగా ఉపయోగపడుతుంది. మీ నగల్ని, ఇతర డాక్యుమెంట్లని సురక్షితంగా లాకర్ల లో భద్ర పరుచుకో వచ్చు. బ్యాంకులు వీటిని పెట్టుకోవడానికి, సదుపాయాన్ని కల్పిస్తూ వార్షిక రుసుమును వసూలు చేస్తాయి. అయితే, ఒకవేళ కనుక వీటికి ఏమైనా ఇబ్బంది కలిగితే, బాధ్యత ఎవరిది..?

RBI Rule if you have gold in locker then this is for you
RBI Rule

లాకర్లలో ఉంచిన వస్తువులని కస్టమర్లకు అద్దెకిచ్చినందున బ్యాంకులు బాధ్యత వహించవు. ఈ వస్తువుల కి బ్యాంకులు బాధ్యత వహించాలని ఆర్బిఐ కొత్త నిబంధనని తీసుకొచ్చింది. బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం, లేదంటే దొంగతనం కారణంగా మీ వాటికి ఏమైనా నష్టం జరిగితే పరిహారం చెల్లించాలి. ప్రకృతి వైపరీత్యాలు, తిరుగు బాట్లు, అల్లర్లు, తీవ్రమైన దాడులు వంటి నష్టాలు వలన పొరపాట్లు జరిగితే బాధ్యత బ్యాంకు వహించదు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధలని కచ్చితంగా తెలుసుకోండి ఈ లాకర్ ని వినియోగించేటప్పుడు ఖచ్చితంగా, వీటి గురించి తెలుసుకొని ఆ తర్వాత మీరు లాకర్లలో విలువైన వాటిని బంగారాన్ని పెట్టుకోవడం మంచిది. కొన్ని కొన్ని సార్లు నిబంధనలను చూసుకోకుండా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు రూల్స్ అన్నీ క్లియర్ గా ఉంటాయి కాబట్టి ఒకటికి రెండుసార్లు చదువుకుని ఆ తర్వాత మీరు నిర్ణయం తీసుకోవడం మంచిది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now