PM Mudra Loan : ఎలాంటి హామీ లేకుండానే రూ.20 ల‌క్ష‌ల రుణం.. మ‌రిన్ని వివ‌రాలు ఇవే..!

January 15, 2026 9:13 PM

PM Mudra Loan : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ 2024-25 ఆర్థిక సంవ‌త్స‌రానికి గాను తాజాగా పార్ల‌మెంట్‌లో బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. అయితే ఈ సంద‌ర్భంగా ఆమె ప‌లు కీల‌క విష‌యాల‌ను ప‌లు అంశాల్లో వెల్ల‌డించారు. ముఖ్యంగా ముద్ర రుణాల ప‌రిమితిపై ఆమె ప‌లు ముఖ్య‌మైన విష‌యాల‌ను ప్ర‌క‌టించారు. ముద్ర ప‌థ‌కం కింద ఔత్సాహికుల‌కు ఇస్తున్న రుణ ప‌రిమితిని పెంచిన‌ట్లు ఆమె తెలియ‌జేశారు. దీని వ‌ల్ల ఎలాంటి హామీ లేకుండానే ల‌బ్ధిదారులు భారీ ఎత్తున రుణం పొంద‌వ‌చ్చు. ఇప్ప‌టి వ‌ర‌కు ముద్ర‌లో ప‌లు విభాగాల్లో గ‌రిష్టంగా రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణం ఇచ్చేవారు. అయితే ఈ ప‌రిమితిని తాజాగా పెంచారు.

కేంద్ర ప్ర‌భుత్వం 2015 ఏప్రిల్ 8వ తేదీన ముద్ర ప‌థ‌కాన్ని ప్రారంభించింది. ప్ర‌ధాన మంత్రి ముద్ర యోజ‌న కింద ఔత్సాహికుల‌కు చిన్న‌, సూక్ష్మ త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు పెట్టాల‌నుకుంటే ఎలాంటి హామీ లేకుండానే త‌క్కువ వ‌డ్డీకే రూ.50వేల నుంచి రూ.10 ల‌క్షల వ‌ర‌కు రుణం ఇచ్చే ప‌థ‌కాన్ని ప్రారంభించారు. అయితే ఈ రుణ ప‌రిమితిని కేంద్రం తాజాగా రూ.20 ల‌క్ష‌లకు పెంచింది. దీంతో ల‌బ్ధిదారులు గ‌రిష్టంగా ఇప్పుడు ఎలాంటి హామీ లేకుండా ఏకంగా రూ.20 ల‌క్ష‌ల మేర రుణం తీసుకోవ‌చ్చు.

PM Mudra Loan limit increased from rs 10 lakhs to rs 20 lakhs
PM Mudra Loan

ఇక ఇప్ప‌టికే ముద్ర రుణాల‌ను తీసుకుని స‌కాలంలో రుణాల‌ను చెల్లించిన వారు రూ.20 ల‌క్ష‌ల మొత్తాన్ని తీసుకునేందుకు అర్హుల‌ని ప్ర‌క‌టించారు. అలాగే కొత్త వ్యాపారం ప్రారంభించాల‌నుకునే వారు కూడా ఈ ప‌థ‌కం కింద రుణాన్ని పొంద‌వ‌చ్చు. దీని కింద చిన్న త‌యారీ యూనిట్లు, దుకాణ‌దారులు, పండ్లు, కూర‌గాయల వ్యాపారులు, స‌ర్వీస్ సెంట‌ర్లు, ఆర్టిస్టులు వంటి వారు రుణాల‌ను పొంద‌వ‌చ్చు.

ఇక ఈ ప‌థకంలో మొత్తం 3 విభాగాలు ఉన్నాయి. చైల్డ్ లోన్ కింద రూ.50వేల వ‌ర‌కు రుణం ఇస్తారు. అయితే కిశోర్ రుణం కింద అయితే గ‌రిష్టంగా రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు లోన్ పొంద‌వ‌చ్చు. అదే త‌రుణ్ విభాగం కింద అయితే ప్ర‌స్తుతం పెంచిన ప‌రిమితి ప్ర‌కారం ఏకంగా రూ.20 ల‌క్ష‌ల వ‌ర‌కు లోన్ తీసుకోవ‌చ్చు. దీంతో వ్యాపారం లేదా ప‌రిశ్ర‌మ స్థాపించి స్వ‌యం ఉపాధి పొంద‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now