Jeevan Umang Policy : రూ.54 పెడితే చాలు.. రూ.48వేలు వ‌స్తాయి.. ఎల్ఐసీ అద్భుత‌మైన ప్లాన్‌..!

November 8, 2023 11:03 AM

Jeevan Umang Policy : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చాలా స్కీమ్స్ ని తీసుకు వస్తూనే వుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకు వచ్చిన స్కీమ్స్ లో జీవన్ ఉమంగ్ పాలసీ కూడా ఒకటి. ఈ స్కీము కి సంబంధించి పూర్తి వివరాలు చూస్తే… 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వాళ్ళు, రిటైర్డ్ అయ్యాక, ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని, ఈ స్కీము లో చేరుతున్నారు. ఆర్థిక భద్రతను అందించడానికి, ఈ స్కీము ని తీసుకు వచ్చారు. అన్‌లింక్డ్, పార్టిసిటింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎన్నో లాభాలను ఇస్తోంది.

పదవీ విరమణ చేసిన వారికి ఆకర్షణీయమైన ఎంపిక కూడా. 100 సంవత్సరాల మెచ్యూరిటీ వయస్సుతో కనీస హామీ మొత్తం రూ. 2,00,000 మరియు 15, 20, 25. 30 సంవత్సరాల తో సహా ప్రీమియం చెల్లింపు నిబంధనల పరిధిని ఇస్తుంది. ప్రీమియం పే చేసే వ్యవధి 30 నుండి 70 సంవత్సరాల వయస్సు లో ముగుస్తుంది. డెత్ బెనిఫిట్, సర్వైవల్ బెనిఫిట్, మెచ్యూరిటీ బెనిఫిట్ ని పొందవచ్చు.

Jeevan Umang Policy from lic gives 48000 with only 54
Jeevan Umang Policy

ఎల్‌ఐసి జీవన్ ఉమంగ్ పాలసీ లో 25 సంవత్సరాల వయస్సులో 30 సంవత్సరాల వ్యవధి కి పెడితే, 28 లక్షల బీమా మొత్తానికి రూ. 6 లక్షల ప్రీమియం ఉంటుంది. నెలకు కేవలం రూ. 1,638, అంటే రోజుకు రూ.54. 55 ఏళ్ల కి ప్రీమియం చెల్లింపు వ్యవధి ముగిసాక, మెచ్యూరిటీ వరకు ఏటా రూ. 48,000 మొదలవుతుంది.

మెచ్యూరిటీ తర్వాత, హామీ మొత్తం బోనస్‌ తో సహా 28 లక్షలు వస్తాయి. ఇలా, ఈ పాలసీ తో మంచిగా లాభాన్ని పొందవచ్చు. మీరు ఈ స్కీము లో, 54 రూ. పెట్టుబడి పెడితే, ప్రతి సంవత్సరం 48000 రూపాయలు ని పొందవచ్చు. పైగా ఈ స్కీము లో డబ్బులు పెట్టడం వలన రిస్క్ కూడా లేదు. మంచిగా లాభాన్ని పొందవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now