Indian Railways : రైల్వే ప్ర‌యాణికుల‌కు ముఖ్య గ‌మ‌నిక‌.. ఈ త‌ప్పు చేస్తే టిక్కెట్ క్యాన్సిల్ అవుతుంది జాగ్ర‌త్త‌..!

November 7, 2023 10:54 AM

Indian Railways : భారతదేశం ప్రపంచంలోనే, నాలుగవ అతిపెద్ద రైల్వే నెట్వర్క్ కలిగి ఉంది. రోజూ వేలాది రైళ్లు వెళుతూ ఉంటాయి. మిలియన్ల మంది ప్రయాణికులు, ప్రయాణాలు చేస్తూ ఉంటారు. రైల్వే ప్రయాణం చేసే వాళ్ళు, కచ్చితంగా ఈ కొత్త రూల్ ని చూడాలి. ఎప్పటికప్పుడు ఇండియన్ రైల్వేస్ రూల్స్ ని మారుస్తూ ఉంటుంది. వాటిని కచ్చితంగా తెలుసుకోవాలి. రైలు బయలుదేరిన 10 నిమిషాలలోపు, వాళ్ళకి కేటాయించిన సీటులో కూర్చోవడానికి విఫలమైతే ప్రయాణికుల టికెట్ ని రద్దు చేసే, అధికారాన్ని టికెట్ చెకింగ్ స్టాఫ్ కి ఇచ్చింది.

ఈ నియమం బోర్డింగ్ ప్రక్రియని క్రమబద్ధీకరించడం, సీట్ల కేటాయింపు సామర్థ్యాన్ని మెరుగుపరచడం కోసం తీసుకువచ్చారు. ఈ నియమం చాలా క్లియర్ గా వుంది. ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత, కొన్ని సార్లు ప్రయాణికులు వాళ్ళకి కేటాయించిన సీట్లలో కూర్చోవడానికి విఫలం అవుతూ ఉంటారు.

Indian Railways important notification about tickets cancel
Indian Railways

దీంతో ఏ ఏ సీట్లు ఖాళీగా ఉన్నాయో తెలుసుకోలేక, టీటీఈలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని అటువంటి సమస్యలు ఏమి కలగకుండా ఉండాలని, భారతీయ రైల్వే శాఖ సీటు కేటాయింపుల కోసం పేపర్ ఆధారిత విధానాల నుండి ఆన్లైన్ సిస్టమ్స్ కి మార్చింది. సీటు ఆక్యుపెన్సి గురించి నిజ సమయ సమాచారం తక్షణమే అందుబాటులో ఉండేటట్టు చూస్తుంది.

అయితే, తాజా నిబంధన ప్రకారం ప్రయాణికులు తమ బోర్డింగ్ టికెట్ పొందిన స్టేషన్ నుండి ప్రయాణించవలసి ఉంటుంది. రైలు ఎక్కిన 10 నిమిషాల్లోగా కేటాయించిన సీట్లో కూర్చోక పోతే, ఆ ప్రయాణికుడుని గుర్తించి, టికెట్ క్యాన్సల్ చేస్తారు. ప్రయాణికులు కచ్చితంగా ఈ నియమానికి కట్టుబడి ఉండాలి. ఏ ఇబ్బంది రాకుండా జర్నీ సాఫీగా సాగాలంటే, ఈ నియమాన్ని ఉల్లంఘించకండి. చాలా మంది, అప్పుడప్పుడు ఈ తప్పు చేస్తూ వుంటారు. అయితే, దీని వలన రైల్వే శాఖ వాళ్లకి ఇబ్బంది ఉండడంతో, ఈ నిర్ణయం తీసుకున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now